ఈ ఏడు ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్ పెట్టండి..!

lakhmi saranya
ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా సోకుతున్న వ్యాధులలో గుండెపోటు కూడా ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఈ గుండెపోటు సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను అరికట్టాలంటే మన బాడీకి కావాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన సూచనలను తెలుసుకోవాలి. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజు రాత్రివేళ ఏడు నుంచి ఎనిమిది గంటలు పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎలా నిద్రపోవడం ద్వారా మన అవయవాలు రిలీఫ్ ని పొంది ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
2. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి.
3. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తప్పనిసరిగా తినాలి.
4. అదేవిధంగా ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని.
5. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా బాడీ అవయవాలు రిలీఫ్ ని పొంది బాడీ స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
6. శరీరానికి సరిపడా మంచినీళ్లు త్రాగాలి. ఇలా త్రాగడం వల్ల బాడీలో ఉండే డస్ట్ బయటకి వెళ్లి శరీరం కుదుటపడుతుంది.
7. అదేవిధంగా శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి.
పైన చెప్పిన వాటిని తప్పనిసరిగా పాటించి మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గుండెపోటు వచ్చిన అనంతరం బాధపడే కంటే రాకముందే జాగ్రత్త పడడం మంచిది. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఏ టైం కి ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. అందువల్లే సినీ సెలబ్రిటీలు సైతం ఫిట్నెస్ ని కాపాడుకుంటున్నారు. అందుకే వాళ్లు ఏజ్ మీద పడినా అంత యంగ్ గా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: