నాని: 'సరిపోదా శనివారం' టైటిల్ చేంజ్ .. కొత్త టైటిల్ ఇదే?

Purushottham Vinay
 గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు.వివేక్ ఆత్రేయ - నాని కలయికలో విభిన్నమైన స్టోరీలైన్‌తో రూపొందుతోన్న ఈ 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును మూవీ యూనిట్ కంప్లీట్ చేసింది. ఇంకా అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటూ వెళ్తున్నారు మేకర్స్.డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో కూడా విడుదలైంది. అలాగే ఓ పాట కూడా విడుదల అయ్యి ఆకట్టుకుంటుంది.


పైగా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. దీనికి తోడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తుండడంతో అన్ని ఏరియాల్లో కూడా హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాని నటిస్తోన్న ఈ క్రేజీ సినిమా టైటిల్‌ను మార్పు చేశారు.'సరిపోదా శనివారం' మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం ఇంకా అలాగే హిందీ భాషల్లో కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఆ భాషల్లో మాత్రం ఈ సినిమా పేరును 'సూర్య శనివారం' గా మార్చడం జరిగింది. ఒక్క తెలుగులో మాత్రమే 'సరిపోదా శనివారం' గా ఉంచుతున్నారు. దీంతో ఈ సినిమా మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.ఇక ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ 'సరిపోదా శనివారం' మూవీలో తమిళ స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో కమ్ డైరెక్టర్ అయిన ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఇక ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: