నాగ్ అశ్విన్ ప్రతి మూవీలో విజయ్ దేవరకొండ? ఎందుకో చెప్పేసిన నాగీ?

Purushottham Vinay
నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడి కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటి దాకా ఈ సినిమా రూ.700 కోట్లు గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది. కల్కి మూవీ విడుదలైన దగ్గర నుంచి అందరీ కళ్లు దర్శకుడు నాగ్ అశ్విన్ మీదే ఉన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుత యువతకు మహాభారతాన్ని కళ్లముందే అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్. దీంతో ఇటు ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా నాగీని ప్రశంసలతో ఎంతో ముంచేతెత్తున్నారు. ఇంకా అంతేకాకుండా.. ఎక్కడ చూసిన కూడా నాగ్ అశ్విన్ గురించే చర్చించుకుంటున్నారు. అంతలా ఆయన కల్కి సినిమాను గొప్పగా తీర్చిదిద్దడమే కాకుండా.. తెలుగు సినిమాను కూడా మరో లెవల్ కు తీసుకెళ్లాడు నాగ్ అశ్విన్.ఇక ఇదిలా ఉంటే. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీలో విజయ్ దేవరకొండ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అర్జునుడి లాంటి పవర్ ఫుల్ పాత్రలో విజయ్ కి ఇచ్చి కామెడీ చేశారంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా.. విజయ్ దేవరకొండ అర్జునుడు గెటప్ ఓకే అనిపించినా, వాయిస్ విషయంలో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. 


అయితే తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ విజయ్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఇంతకి నాగ్ అశ్విన్ విజయ్ గురించి ఏమన్నారంటే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ నా బెస్ట్ ఫ్రెండ్. అతను నా ప్రతి సినిమాలో హీరోగా చేస్తే హ్యాపీ. ఒకవేళ అలా కుదరకపోతే తన కోసం ఏదో ఒక స్పెషల్ రోల్ ని క్రియేట్ చేస్తాను. అలా నా ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ ఉంటాడు' అంటూ తమ స్నేహం గురించి నాగ్ అశ్విన్ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ కావడంతో నెటిజన్స్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఫ్రెండ్ షిప్ అంటే మీదే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గతంలో విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం ఇంకా మహానటి సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: