కేసీఆర్‌కు ఊహించని షాక్.. ఎంపీ పదవికి రిజైన్ చేసిన బీఆర్ఎస్ కీలక నేత..!
తెలంగాణలో కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్ రోజు రోజుకీ మరింత బలహీనంగా తయారవుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో కెసిఆర్ కంగుతున్నారు. ఆయనకు ఇలాంటి భారీ షాక్‌లు నిత్యం తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కంచర్ల కేశవరావు ఎంపీ పదవికి రిజైన్ చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
రాజీనామా చేశాక ఆ పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకడ్ కు సమర్పించారు. రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కేశవరావు కొద్ది రోజుల క్రితం అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో ఈ నేత హస్తం పార్టీ తరఫున పలు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ గా వర్క్ చేశారు. 2005లో ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2006–2012 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా సేవలందించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో అయినా కాంగ్రెస్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నా అసహనం బాగా పెరిగిపోవడంతో 2013లో బీఆర్‌ఎస్ లో జాయిన్ అయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్ గా పదవి చేపట్టారు. 2014లో రాజ్యసభ మెంబర్ అయ్యారు. 2020లో మరోసారి అదే పదవికి ఎన్నికయ్యారు. ఆయనకు మరో రెండేళ్లు పదవీకాలం ఉంది కానీ కేకే అదే అవసరం లేదన్నట్టు రాజీనామా చేశారు.
హైదరాబాద్ మేయర్‌గా ఉన్న కేకే కుమార్తె విజయలక్ష్మి ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కేకే కుమారుడు విప్లవ్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కేకే.. ఇప్పుడు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా కొనసాగుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ తర్వాత పార్టీలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి, కేవలం 39 సీట్లు మాత్రమే సాధించి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటీ దక్కించుకోలేదు. దీంతో పలువురు పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరికొందరు అదే బాట పెట్టానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ నేత కేకే కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి పార్టీ ద్వారా తనకు లభించిన రాజ్యసభ సీటును వదులుకున్నారు.