శోబితా : 2018లోనే అక్కినేని ఇంట్లో అడుగుపెట్టా?
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం వారి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజులు ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల హనీమూన్ ట్రిప్ కి వెళ్లాలని ప్లాన్ లో ఉన్నారట.
ఇదిలా ఉండగా.... నాగచైతన్యతో వివాహ అనంతరం శోభిత కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. వారిద్దరి మధ్య స్నేహం 2002 ఏప్రిల్ నెలలో ప్రారంభమైందని శోభిత చెప్పింది. 2018 సంవత్సరంలోనే నాగార్జున ఇంటికి మొదటిసారిగా వెళ్లినట్లుగా శోభిత వెల్లడించింది. అంటే సమంత, నాగచైతన్య వివాహం జరిగిన సంవత్సరంకి శోభిత నాగార్జున ఇంట్లో అడుగుపెట్టిందట. ఆమె నాగచైతన్యను మొదటిసారి ముంబైలోని ఒకే కెఫేలో కలిసినట్టుగా వెల్లడించింది.
అప్పట్లో శోభిత ముంబైలో ఉన్న సమయంలో నాగచైతన్య హైదరాబాద్ లో ఉన్నట్టుగా శోభిత చెప్పింది. వీరిద్దరూ కలిసి వివాహానికి ముందే ఓ పార్కుకు వెళ్లి ఏకాంతంగా కొంత సమయాన్ని గడిపినట్టుగా శోభిత వెల్లడించింది. అనంతరం అక్కడే కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వెళ్ళినట్లుగా శోభిత వెల్లడించింది.
శోభిత ఈ విషయాలు చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా శోభిత, నాగచైతన్య పెళ్లికి ముందే ట్రిప్ లకు కూడా వెళ్లారు. అక్కడ ఇద్దరు చాలా క్లోజ్ గా ఫోటోలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం శోభితనే అంటూ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.