సప్తగిరి 2 వేలకోట్ల పై సెటైర్లు !
లేటెస్ట్ జరిగిన ‘రాజాసాబ్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమెడియన్ సప్తగిరి ఆవేశంగా చేసిన ప్రశంసల పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. ఈసినిమాకు 2 వేల కోట్ల రూపాయలు కలక్షన్స్ రావడం ఖాయం అంటూ సప్తగిరి ఆవేశంగా చెప్పాడు. వాస్తవానికి సంక్రాంతికి అత్యంత భారీ సినిమాల పోటీ మధ్య ‘రాజా సాబ్’ విడుదలవుతున్న నేతృత్వంలో అంత భారీ పోటీ మధ్య 1000 కోట్లు కలక్షన్స్ వస్తే చాల గొప్ప విషయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలాంటి వాస్తవాన్ని పట్టించుకోకుండా సప్తగిరి ‘రాజా సాబ్’ ఏవిధంగా 2 వేల కోట్ల కలక్షన్స్ వస్తాయని ఊహస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ దృష్టిని ఆకర్షించడానికి సప్తగిరి ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అని భావిస్తున్నప్పటికీ ‘బాహుబలి 2’ ‘పుష్ప 2’ లాంటి బ్లాక్ బష్టర్ సినిమాలు అందుకోలేకపోయిన రికార్డులు ఎంతవరకు ‘రాజా సాబ్’ అందుకుంటాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
టాప్ హీరోలు చిరంజీవి రవితేజాలు ప్రభాస్ తో పోటీ పడుతునప్పటికీ ఆవిషయాలను పట్టించుకోకుండా సప్తగిరి అన్న మాటలు పట్టించుకోకుండా సప్తగిరి చేసిన కామెంట్స్ పై మరి కొందరు సెటైర్ లు కూడ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఈమూవీలో ప్రభాస్ నెగిటివ్ క్యారెక్టర్ కూడ చేస్తున్న పరిస్థితులలో ప్రభాస్ కు ఈమూవీ అంత్యంత కీలకంగా మారింది. అయితే చిరంజీవి రవితేజ్ లపోటీ పోటీ కూడ ఉన్న నేపధ్యంలో అత్యంత భారీ రేట్లకు బయ్యర్లు ‘రాజా సాబ్’ ను కొన్న నేపద్యంలో ఈమూవీ ఫలితం తెలిసేవరకు బయ్యర్లు టెన్షన్ పడుతూనే ఉంటారు..