దుబాయ్‌లో పరిస్ధితులు..షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ..!
ఇలాంటి పరిస్థితుల మధ్య దుబాయ్‌లో నివసిస్తున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ ద్వారా తాను, తన కుటుంబం సురక్షితంగా ఉన్నామని తెలియజేశారు. “మేము దుబాయ్‌లో సురక్షితంగా ఉన్నాం. మా గురించి ఆరా తీస్తూ ఫోన్లు, మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ కేర్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక్కడ పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.తన పిల్లలు నివృత్తి, నావిష్కలతో కలిసి సురక్షితంగా ఉన్నామని స్పష్టంగా చెప్పి అభిమానులకు ధైర్యం చెప్పారు. యుద్ధ వాతావరణం గురించి వస్తున్న వార్తల కారణంగా ఆందోళన చెందుతున్న తన సన్నిహితులు, అభిమానులను ఉద్దేశించి ఆమె ఈ సందేశాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, దుబాయ్‌లో జీవనం సాధారణంగానే కొనసాగుతోందని ఆమె స్టోరీ ద్వారా అర్థమవుతోంది.
అయితే, శ్రీజ చేసిన మరో వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె తన స్టోరీలో బూర్జ ఖలీఫ్ మరియు దుబాయ్ స్కైలైన్ ఫోటోను షేర్ చేస్తూ, “మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాం. మేము దీనికే కట్టుబడి ఉంటాం,” అని రాశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె దుబాయ్‌ను తాత్కాలిక నివాసంగా కాకుండా, శాశ్వతంగా తమ జీవితానికి కేంద్రంగా ఎంచుకున్నారని చాలామంది భావిస్తున్నారు.గతంలో ఆమె హైదరాబాద్‌లో నివసించేవారని తెలిసిందే. అయితే ఇప్పుడు దుబాయ్‌ను తన సొంత దేశంలా భావిస్తూ అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారనే సంకేతాలు ఈ పోస్టుల ద్వారా కనిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.