అందులో శోభితని మించిపోయిన సమంత.. ఏకంగా ..?

Divya
అక్కినేని నాగచైతన్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా పర్సనల్ లైఫ్ లో నిలుస్తూ ఉన్నారు.. శోభితని ఇటీవలే పెళ్లి చేసుకున్న నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంతని కూడా ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోవడంతో శోభితనీ పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగచైతన్య ,సమంత విడిపోయినప్పటి నుంచి ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు. సమంత కూడా మయోసైటీస్ వ్యాధి బారిన పడడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి బయటపడుతున్న సమంత పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

ఇలాంటి సమయంలోనే నాగచైతన్య భార్య శోభిత ,మాజీ భార్య సమంత ఆస్తి విషయంలో ఎవరికి ఎక్కువ ఉందనే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్ సైతం చర్చించుకుంటున్నారు. సమంత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 15 ఏళ్లు అవుతోందట.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సమంత ఆస్తి సుమారుగా 110 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.. అంతేకాకుండా సమంత కొన్ని రకాల యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాకుండా కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఇక శోభిత విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం రూ .20 కోట్ల లోపల సంపాదించిదనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ నాగచైతన్య మీద ఉన్న ఆస్తుల విషయాలు కలుపుకుంటే సుమారుగా 150 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తానికి సమంత మాత్రం శోభితను ఈ విషయంలో మించిపోయిందని చెప్పవచ్చు.. ఇక నాగచైతన్య ,శోభిత ప్రస్తుతం పలు రకాల దేవాలయాలను సందర్శిస్తూ బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అభిమానులు వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: