ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ట్రోల్ చేసే వాళ్ళకి మీమర్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్టే అనిపిస్తోంది.ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. ఇక ఆ వీడియో చూసి నెటిజన్స్ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ వీడియోలో నాగచైతన్య భార్య శోభిత దూళిపాళ్ల తమన్నా లవర్ విజయ్ వర్మ ఇద్దరూ ఒకే దగ్గర నిల్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ వీడియోలో శోభిత ధూళిపాళ్ల మోడ్రన్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. అలా మాట్లాడుకుంటున్న శోభితా ధూళిపాళ్ల విజయ్ వర్మ ఇద్దరూ ఒకరి చేతు ఒకరు పట్టుకొని తెగ నలిపేసుకుంటున్నారు. అయితే ఈ వీడియోని కొంతమంది ట్రోలర్స్ ఎడిట్ చేసి ముందు సమంతా ఫోటోని పెట్టి శోభిత నుండి విజయ్ వర్మని సేవ్ చేసుకో తమన్నా అంటూ సమంత తమన్నా కి ఒక సజెషన్ ఇస్తున్నట్టు వీడియో క్రియేట్ చేశారు.
అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే సమంత ఫోటో పెట్టి ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ చేయడానికి కారణం సమంత దగ్గర నుండి నాగచైతన్యను శోభిత ఎలా అయితే లాక్కుందో అదే విషయాన్ని సమంత తమన్నాకి చెబుతూ ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నట్టు ఈ వీడియో ఉందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మందేమో సమంత అనుభవించింది అందుకే తమన్నాకి సలహాలు ఇస్తుంది కాస్త జాగ్రత్త అంటూ ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. నాగచైతన్య ఎప్పుడైతే శోభితతో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేశారో అప్పటినుండి శోభిత నాగచైతన్య పై ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా చైతు శోభిత పెళ్ళికి కొద్దిరోజులు ఉంది అనగా సమంత ఓ ఇంటర్వ్యూలో మీరు ఇప్పటివరకు ఖర్చుపెట్టిన దాంట్లో అనవసరమైన ఖర్చులు అని దేనికి అనిపించింది అని అడిగితే నా మాజీ భర్తకు ఇచ్చిన విలువైన గిఫ్టులు అనవసరపు ఖర్చులు అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. అయితే చైతు శోభితల లవ్ మేటర్ తెలియడంతోనే చాలామంది చైతు మామూలోడు కాదు..ఎంతో నిజాయితీగా ఉండే సమంతని మోసం చేశాడు.ఆమెని కాదని మరో అమ్మాయి మోజులో పడ్డాడు. అందరూ సమంతకి తప్పు అనుకున్నారు. కానీ తప్పు ఎవరిదో ఇప్పుడు తెలిసి వచ్చిందిగా అంటూ సమంత అభిమానులు ఆమెకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.