లీల వినోదం సినిమాపై కీలక వ్యాఖ్యలు
అయితే ఇంత గొప్ప ఇమేజ్ క్రియేట్ చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ లీల వినోదం అనే ఒక తెలుగు రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామా ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. లీలా వినోదం సినిమాకు పవన్ సుంకర దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో షణ్ముఖ్ కి జోడీగా మలయాళ భామ అనఘా అజిత్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే, ఈ సినిమాలో గోపరాజు రమణ, సీనియర్ హీరోయిన్ ఆమని, రూపాలక్ష్మీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో డిసెంబర్ 19 అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలో తన జీవితంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుని స్టేజీపైనే షణ్ముఖ్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'లీలా వినోదం క్యూట్ లవ్ స్టోరీ. మేము ఇంట్రడ్యూస్ చేసిన 5వ డైరెక్టర్ పవన్. తప్పకుండా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతాడు. అందరికీ థాంక్యూ సో మచ్. లీలా వినోదం మీ అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు. అనంతరం షణ్ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. 'అమవాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు లీల వినోదం ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అని యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ చెప్పుకొచ్చారు.