ఈ అలవాట్లు ఉంటే మానసికంగా దృఢంగా ఉన్నట్టే..?

Divya
ఎవరైనా సరే మానసికంగా దృఢంగా ఉండడం అనేది ఎవరి జీవితంలోనైనా చాలా కీలకమైన అంశము ముఖ్యంగా మనం ఆనందంగా ఉన్నామా బాధగా ఉన్నామా అనేది కూడా మన మెదడు నియంత్రిస్తూ ఉంటుంది.. మన మెదడు ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్నామా బాధగా ఉన్నామా అనే విషయాలను కూడా డిసైడ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది పరిశోధకులు మనం మానసికంగా దృఢంగా ఉన్నామా లేమా అనే అంశాల పైన అలవాట్ల ద్వార తెలుసుకోవచ్చట.. కొన్ని అలవాట్లు కలిగి ఉన్నవారు కచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా మానసికంగా ఉన్నట్లు అన్నట్లుగా తెలుపుతున్నారు. వాటి గురించి చూద్దాం.

1). ముఖ్యంగా మీ బలాలు బలహీనతలు ఏమిటనే విషయం మీకు అవగాహన ఉండడం.

2). మీరేమిటో మీకు తెలిశాక మీ సరిహద్దులు ఏంటి మీ పరిధులు ఏంటి అనే విషయాలు గుర్తించడం. మీరు ఎక్కడ ఎస్ చెప్పాలి.. ఎక్కడ నో చెప్పాలి అనే విషయం పైన కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం.
3). మీరూ ఎక్కువగా ప్రియారిటి మీ ప్రస్తుత స్థితిని మెరుగుపరుచుకోవడం పైన ఉంటే గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు కోట్లు సంపాదించాలనుకునేవారు తమ దగ్గర ఉన్న వాటితోనే హ్యాపీగా బతకడం.

4). మీరు ఎవరిని ప్రేమించిన ప్రేమించకపోయిన మిమ్మల్ని మీరు కచ్చితంగా ప్రేమిస్తూ ఉండడం కీలకమని చెప్పవచ్చు.

5).చేసిన పొరపాట్లు ఎదురైనా ఓటమిల నుంచి నేర్చుకునే గుణపాఠం వంటి తత్వం కలిగిన వారు కచ్చితంగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు.

6). మనిషి జీవితం అంతా కూడా ఎమోషనల్ కలయికే కాబట్టి ఎలాంటి బాగోద్వేగాలనైన నియంత్రించుకోవడం చాలా కీలకమని చెప్పవచ్చు.

7). మానసికంగా దృఢంగా ఉండడంలో చాలా కృతజ్ఞత భావం కలిగి ఉండడం కీలకమైనది.. ప్రస్తుతం ఉన్న స్థితి మీద కాకుండా సాధించే దానిమీద వాటి చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి.

ఈ అలవాట్లు అన్నీ కూడా మానసికంగా దృఢంగా ఉండేవారి అలవాట్లే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: