'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ కు ఇదే రైట్ టైం!
ఈ క్రమంలోనే అలనాడు రిలీజైన ఇటువంటి సినిమాలపైన తెలుగు దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. నిర్మాతలు కూడా బడ్జెట్ పరిమితులు పెట్టుకోకుండా కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న 'కల్కి 2898 AD' సినిమానే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో జూన్ నెలాఖరున రిలీజైన ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు నిర్మాత అశ్వినీ దత్ ''జగదేక వీరుడు అతిలోక సుందరి'' సీక్వెల్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో చాలా జోరుగా నడుస్తోంది.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, దివంగత అందాల నటి శ్రీదేవి కాంబోలో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఓ వెండితెర అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూమ్మీదకు వచ్చి ఒక సాధారణ మానవుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగు జనాలు నీరాజనాలు అర్పించారు. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఈ అద్భుతమైన కథను, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంతే అద్భుతంగా తెరకెక్కించడంలో వందశాతం సక్సెస్ అయ్యారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీ దత్ నిర్మించారు. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా.. ఆ సమయంలో టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా తదుపరి భాగంమీద దర్శక నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.