నందమూరి హీరోతో విడదల రజిని చర్చలు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత... చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి... కేసులు పెడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వైసిపి నేతలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఏపీ రాజకీయాలలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి వచ్చాడు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజిని... జూనియర్ ఎన్టీఆర్ ను కలిసినప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట... జూనియర్ ఎన్టీఆర్ అలాగే విడదల రజిని ఇద్దరు... ఓ ఫంక్షన్ కు వెళ్లారట. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను చూసి వెంటనే... కృతజ్ఞతా భావంతో నమస్కారం చేశారట రజిని. ఇక రజిని నమస్కారం చేయడంతో... ప్రతి నమస్కారం కూడా చేశారట నందమూరి తారక రామారావు.

ఆ తర్వాత... రజిని అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాసేపు ఏపీ రాజకీయాల గురించి చర్చించినట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం... రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ జీవితాన్ని మాజీ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల సమయంలో టిడిపిలోనే ఉన్నారు రజిని.

ఆ సమయంలో టికెట్ దక్కకపోవడంతో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున టికెట్ దక్కించుకొని విజయం కూడా సాధించారు. ఈ తరుణంలోనే రెండవ విడత కేబినెట్ విస్తరణలో... రజినికి ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా వచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో రజిని విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి కాకుండా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రజిని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: