విజయ్- రష్మిక పెళ్లి నగల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

Divya
టాలీవుడ్లో స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఆనందపడ్డారు ఈ జంట. అయితే ఈ జంట వివాహ సమయంలో ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయని చెప్పవచ్చు. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిలో చాలా తక్కువగా ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. అయితే విజయ్, రష్మిక జంట మాత్రం ఒంటినిండా బంగారు ఆభరణాలను ధరించారు.


పెళ్ళికొడుకు విజయ్ మెడలో, చేతులకు ఆభరణాలు ధరించారు. అయితే ఈ ఆభరణాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ  ఆభరణాల గురించి తెలుసుకోవడానికి అటు అభిమానులు, నెటిజెన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఈ జంట ధరించిన ఆభరణాలు మార్కెట్లో దొరికేవికావట. వివాహం కోసమే ప్రత్యేకించి మరి తయారు చేయించారని సమాచారం. అది కూడా హైదరాబాదులో ఉండే ఒక ప్రముఖ నగల దుకాణం నుంచి ఈ ఆభరణాల తయారీ కోసం పది నెలల పాటు శ్రమించినట్లు వినిపిస్తున్నాయి.


కేవలం ఈ నగల డిజైన్ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టిందట. అలాగే ప్రతి డిజైన్ కూడా రష్మిక, విజయ్ శరీరాలకు అచ్చంగా సరిపోయేలా డిజైన్ చేయించినట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బంగారు ఆభరణాల పై ఏనుగులు, పులులు వంటి జంతువుల రూపాలను కూడా చేర్చినట్లు వినిపిస్తున్నాయి. కాళ్లకు కూడా కడాలు ధరించి మగవారి ఆభరణాలలో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు విజయ్ దేవరకొండ. రష్మిక ధరించిన ఆభరణాల విషయానికి వస్తే .. భారత ఆలయ శిల్పకలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం 11 రకాల ఆభరణాలను చేయించినట్లు సమాచారం. ఈ పెళ్లి నగల కోసమే ఏకంగా రూ .4నుంచి రూ .5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని వినిపిస్తున్నాయి. అటు వివాహ విషయంలో వైరల్ గా మారిన జంట, ఇప్పుడు బంగారు ఆభరణాలతో కూడా మళ్లీ వార్తలలో నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: