ట్రైలర్: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. ఫాన్స్ పూనకాలే..?

Divya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతిబాబు, శివరాజ్ కుమార్ తదితర నటీనటులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేసింది తాజాగా ఈ సినిమా జూన్ 4వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం తాజాగా జియో వరల్డ్ డ్రైవ్ లో ఈ సినిమా ట్రైలర్ ని నిర్వహించింది.



ట్రైలర్ విడుదల చేయగా భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రైలర్ సంచలనంగా మారింది. రామ్ చరణ్ గతంలో ఎన్నడు చూడని విధంగా రెండు విభిన్నమైన గెటప్స్ లో పెద్ది సినిమాలో  కనిపించబోతున్నారు. 1984 రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రాంచరణ్ ఒకవైపు విలేజ్ క్రికెటర్ గా మరొకవైపు పహిల్వాన్ గా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ అభిమానులను మరింత పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చే క్రాస్ ఓవర్ షాట్స్ సైతం ట్రైలర్ ని మరింత హైలెట్గా చేస్తున్నాయి.


ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. అలాగే జాన్వీ కపూర్ అందాలు ఈ సినిమాకి మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మైత్రి మూవీస్ మేకర్స్  ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొత్తం మీద పెద్ది ట్రైలర్ తో సినిమా పై మరింత అంచనాలను రెట్టింపు చేసేలా కనిపించిందని చెప్పవచ్చు. దాదాపుగా ఐదేళ్ల గ్యాప్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: