ఏపీ: ఆరోగ్య వార్తలపై క్లారిటీ ఇచ్చిన బొత్స సత్యనారాయణ..!
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రొటీన్ చెకప్ లో భాగంగానే తాను ఆసుపత్రికి వెళ్లానని తెలియజేశారు. తన ఆరోగ్యం పైన ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియజేశారు. తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని జరుగుతున్న వార్తలు కేవలం ఒట్టి రూమర్సేనని రొటీన్ చెకప్ కోసమే తాను ఆసుపత్రికి వచ్చానని తెలియజేశారు. రేపో మాపో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో అటు కార్యకర్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార కూటమి సభ్యులకు ,వైసీపీ సభ్యులకు మధ్య వాడివేడి గానే చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీకి వైసీపీ నేతలు రాకపోవడంతో మండలి చర్చలు అసెంబ్లీ తరహాలో జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఇందులో చురుకుగా పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఇలా హఠాత్తుగా కనిపించకపోవడంతో అస్వస్థకు గురై ఆస్పత్రి పాలయ్యారని వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అటు అభిమానులు రాజకీయ నాయకులు కంగారుపడుతున్న విషయాన్ని గుర్తించి ఆయన ఆరోగ్యం పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనాప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా వైసిపి అభిమానులు నేతలు సైతం పోస్ట్ పెడుతున్నారు. తిరిగి వచ్చి అనంతరం బొత్స సత్యనారాయణ తిరిగి రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని కార్యకర్తల సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.