ఏపీ: వీడియో వైరల్ చెప్పుతో కొట్టుకున్న టిడిపి నేత.. ఏం జరిగిందంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూటమిలో భాగంగా ఉన్న టిడిపిలో అసంతృప్తి నేతలు రోజు రోజుకి పెరుగుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరిగిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. టిడిపి ఇన్చార్జ్ అయిన గొట్టిపాటి లక్ష్మి వచ్చే ఎన్నికలలో మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో అక్కడ ఉండే టిడిపి నేతల వద్ద పెద్ద ఎత్తున కమిషన్ వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం రోజున ముండ్లమూరు మాజీ మండల కన్వీనర్ శ్రీనివాసరావు.. అసలు 2024 లో టిడిపి పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా ?అని తన చెప్పుతో తన కొట్టుకున్నట్లు ఒక వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేశారు.


ఈ వీడియో చూసిన అటు కార్యకర్తలు, నేతలు, ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పార్టీలో కొనసాగడం ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తారు. కానీ తాను సెల్ఫీ వీడియో తీసుకొని మరి చెప్పుతో కొట్టుకొని వీడియో పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ నియోజకవర్గంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అంటు పలువురు కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. శ్రీనివాసరావు 14 ఏళ్లుగా టిడిపి పార్టీలో మండల కన్వీనర్ గా ఉన్నారు. ఇలాంటి నేత ఒక వెంచర్ విషయంలో మట్టి పనుల కోసం , ఇతర పనుల కోసం యజమాని వద్ద డీల్ కుదుర్చుకొని పనులను మొదలుపెట్టగా, ఆ వెంచర్ వేసేందుకు ఇంచార్జ్ అనుమతి కోసం ఏకంగా కోటి రూపాయలు డీల్  కుదురుచ్చారని, అందులో రూ .60 లక్షల రూపాయలు ఇవ్వగా మిగిలిన రూ .40 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.

ఇందులో భాగంగా తలెత్తిన వివాదం వల్ల ఆయన తన చెప్పుతో కొట్టుకున్నాడని వినిపిస్తున్నాయి. గతంలో చేసిన పనులలో కమిషన్  ఇవ్వలేదని బిల్లులు ఇవ్వకుండా వేధించారని, వీటి కారణం వల్ల ప్రకాశం జిల్లా  దర్శి నియోజకవర్గంలో టిడిపి నుంచి జనసేన పార్టీలోకి చాలామంది నేతలు, కార్యకర్తలు చేరినట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగాలి అన్న బిల్లులు జరగాలన్న కమిషన్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా టిడిపి ఇన్చార్జ్ పీఏ భారీ మొత్తంలో అక్కడ వసూలు చేస్తున్నారని విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై నారా లోకేష్ ఎలా స్పందిస్తారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: