ఇప్పటిదాకా కల్కి టోటల్ షేర్, గ్రాస్ కలెక్షన్స్ ఇవే?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. దీపికా పడుకోన్, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.


భారీ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర  ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే 440 కోట్ల దాకా షేర్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ టార్గెట్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. ఈ సినిమాకి టోటల్ గా 380 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది. ఇప్పటికే దాదాపు 60 కోట్ల దాకా లాభాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. 


తెలుగు రాష్ట్రాల్లో 190 కోట్లకు పైగా రాబట్టిన కల్కి... ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాలీవుడ్ లో ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. ప్రభాస్ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిన మూవీస్‌గా నిలిచాయి. 


బాహుబలి 2 రూ.1814కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇది రూ.865 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ` రూ.630 కోట్లతో మూడో స్థానంలో ఉంది. `సలార్‌ రూ.623కోట్లతో మూడో స్థానంలో ఉండగా, నాలుగు సినిమాలకు రూ.500కోట్లకుపైగా కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రభాస్‌. ఇక నార్త్ అమెరికాలో 15.50 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓవరల్ ఓవర్ సీస్ మార్కెట్లో 27 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: