ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పూత్. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే కొందరు మాత్రం తనపై కక్షగట్టినట్లు తనను తప్పుదోవ పట్టించారని దానివల్ల నేను కోలుకోలేని దెబ్బ అనుభవించా అని చెప్పుకోస్తోంది పాయల్. అయితే ఇటీవల మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత ఆమె చేసిన సినిమా రక్షణ. కాగా ఈ సినిమాతో
త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది పాయల్. హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కెరియర్ లో మాత్రం ఎప్పుడూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే వస్తున్నాను అంటూ చెప్పకుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ లలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు చేసింది పాయల్. దాంతో ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 'ఆర్ఎక్స్ 100' కథలో భాగంగానే
శృంగార సన్నివేశాలు ఉన్నాయి. కానీ, కథలో లేకున్నా.. అనవసరంగా అలాంటి సన్నివేశాలు జొప్పిస్తే మాత్రం ఒప్పుకోను. ఇలియానా, అనుష్కశెట్టి అంటే ఇష్టం. పవన్‌కళ్యాణ్ చిత్రాలు ఎక్కువగా చూస్తాను. అవకాశం వస్తే మహేశ్‌బాబు, ప్రభాస్ సినిమాల్లో చేయాలని ఉంది. ప్రభాస్ నా ఫేవరెట్. ఆయనకు లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. తను ఏది అడిగితే అది చేసిపెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్ నాకు నాకు చాలా ఇష్టం. దాన్ని నేనే స్పెషల్‌గా వండి నా చేత్తో ప్రభాస్‌కు తినిపించాలని ఉంది. అలాంటి చాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను. నేను ఎలాంటి పాత్రలు పోషించాలన్నది ప్రధానం కాదు. స్క్రిప్టులో బలం ఉండాలి. కథ లేకుండా, ఎలాంటి పాత్ర చేసినా ఫలితం శూన్యమే. ముందుగా కథ, నా పాత్ర నచ్చాలి. డైరెక్టర్ మంచివాడై ఉండాలి. అలాంటి సినిమాలే ఒప్పుకొంటాను. అంటూ చెప్పుకొచ్చింది..!!