కల్కి ఓ చెత్త సినిమా అంటున్న బాలీవుడ్ క్రిటిక్?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా టోటల్ గా వారంలో రూ. 350 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది.

ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 36 కోట్లు వసూళ్లు చేస్తే సరిపోతుంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ మూవీ ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ మీడియా కల్కి సినిమా మీద విమర్శలను చేస్తు ఏడుస్తూ ఉంది. తెలుగు సినిమా బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తున్న క్రమంలో మన తెలుగు సినిమాలను ఎలాగైనా సరే తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశ్యం తోనే బాలీవుడ్ మీడియా ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతూ ఉంటుందనే విషయం దేశం మొత్తం తెలిసిందే. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కేఆర్ కే (కమల్ ఆర్ ఖాన్) అనే వ్యక్తి మరోసారి కల్కి సినిమా మీద భారీ విమర్శలను చేస్తున్నాడు. రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా కల్కి సినిమా కంటే 20 రెట్లు బెటర్ అని అతను కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: