పెద్ది సినిమాలో జగపతిబాబు రోల్ ఇదే.. లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

Reddy P Rajasekhar

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమాలో జాన్వీ కపూర్ అచ్చాయమ్మ పాత్రలో కనిపించనుండగా జగపతి బాబు ఈ సినిమాలో అప్పాల సూరి పాత్రలో కనిపించనుండటం గమనార్హం.

గతంలో ఎప్పుడూ  కనిపించని పాత్రలో జగపతిబాబు కనిపించడం  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగపతిబాబు ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. సులువుగా గుర్తు పట్టలేని విధంగా జగపతిబాబు  తన లుక్ ను మార్చుకోవడం కొసమెరుపు. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

పెద్ది సినిమా చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పెద్ది సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో  కష్టపడుతున్నారు. పెద్ది సినిమా సెకండ్ సింగిల్ సంక్రాంతి తర్వాత విడుదల కానుందని తెలుస్తోంది.

పెద్ది సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా  ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. పెద్ది సినిమా సక్సెస్  సాధిస్తే బుచ్చిబాబు రేంజ్ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్ది సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్ది సినిమాకు ఏ ఆర్ రెహమాన్  ప్లస్  అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ది సినిమా టీజర్ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.పెద్ది సినిమా  రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ కు ఈ మధ్య కాలంలో సోలో హీరోగా సరైన సక్సెస్ లేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: