హీరో విజయ్ కి మరో షాక్ ఇచ్చిన కుమారుడు..!

Divya
తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. పూర్తిగా సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి అభిమానుల సమక్షంలోనే రాజకీయ పార్టీని ప్రకటించి మేనిఫెస్టో కూడా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు విజయ్. ఈ క్రమంలోనే అనూహ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి నిరంతరం ఏదో ఒక విషయం చర్చనీయంశంగా మారింది. తన భర్తకు మరొక నటితో అక్రమ సంబంధం ఉన్నదంటు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం, హీరోయిన్ తో విజయ్ కలిసి తిరగడం వంటి అంశాలు తమిళనాడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.



ఏప్రిల్ 20వ తేదీన ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. మరొకవైపు విజయ్ ఇంట్లో తన విడాకుల వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. దాదాపుగా ఐదు సంవత్సరాలుగా తాను నరకం అనుభవిస్తున్నాను అంటూ విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్లో దాఖలు వేసింది.ఇదంతా ఇలా ఉండగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సోషల్ మీడియాలో విజయ్  ను  అన్ఫాలో చేశారు.


సాధారణంగా తండ్రి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని ఇనిషియల్ గా ఉపయోగించుకోవడం ఆనవాయితీ ఇప్పుడు జాసన్ సంజయ్ మాత్రం తన ఇన్సెల్లి మార్చుకున్నట్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. తండ్రి విజయ్ పేరుతో వచ్చే వి అక్షరాన్ని తొలగించుకొని తన తల్లి పేరుతో వచ్చే ఎస్ అక్షరాన్ని చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరో గానే కాకుండా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా కూడా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. సిగ్మా అనే చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇనిషియల్ కాకుండా తన తల్లి పేరుతో వచ్చే ఇనిషియల్ ని టైటిల్ కార్డులో చూపించబోతున్నారని తెలిసి ఇది పెద్ద చర్చకు దారితీసింది. దీన్నిబట్టి చూస్తే విజయ్ తనయుడు కూడా విజయ్ కి దూరం అవుతున్నారనే సందేహాలు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: