రాజా సాబ్ ట్రైలర్ రివ్యూ: గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి..ఇది నిజంగానే ప్రభాస్ రేంజ్ సినిమానా బ్రో..?
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ప్రభాస్‌ను అభిమానులు ఏ గెటప్‌లో చూడాలనుకుంటున్నారో, ఆయన నుంచి ఎలాంటి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆశిస్తున్నారో, అచ్చంగా అలాంటి పాత్రనే ప్రభాస్‌కు ఇచ్చాడని దర్శకుడు మారుతిని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా ఎమోషనల్‌గా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందనే విషయం ట్రైలర్ ద్వారానే స్పష్టంగా తెలుస్తోంది.
ట్రైలర్‌లో ప్రభాస్ ఎమోషన్స్, కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు, ఆయన నోటి నుంచి వచ్చే డైలాగ్స్ చాలా హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్‌తో ఉన్న రొమాంటిక్ టచ్ కూడా చాలా న్యాచురల్‌గా, బాగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోంది. మారుతి ఈ సినిమాలో ప్రభాస్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించడానికి ప్రయత్నించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ఇక ఈ సినిమా మొత్తం ఒక నానమ్మ – మనవడు మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని ఆధారంగా చేసుకుని సాగుతుందనే విషయం ట్రైలర్‌లోనే క్లియర్‌గా చూపించారు. చనిపోయిన తాతకు కోపం వస్తే ఏం చేస్తాడు అనే కాన్సెప్ట్‌ను చాలా ఆసక్తికరంగా, వినూత్నంగా ప్రెజెంట్ చేశారు. ఈ ఎమోషనల్ ఎలిమెంట్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలవబోతుందని అనిపిస్తోంది.
మరొకవైపు, ట్రైలర్‌లో ప్రభాస్ ముసలి పాత్రలతో చేసే ఫైట్ సీన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సీన్స్‌లో వాడిన గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ట్రైలర్‌ను బట్టి చెప్పవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతున్నాయని కూడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రభాస్ అభిమానులు ట్రైలర్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుండగా, మరికొంతమంది మాత్రం కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, ఇది ప్రభాస్ రేంజ్‌కు తగ్గ సినిమా కాదేమో అనే సందేహం వ్యక్తమవుతోంది. కథ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మారుతి ఇచ్చిన కొత్త ఎలివేషన్ టచ్ కూడా ఆకట్టుకుంటుంది కానీ ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్‌కు ఇది సరిపడే సినిమానా అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు.
మరికొందరు అభిమానులు మాత్రం ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారని, అందుకే ఇది వేరే స్టైల్‌లో ఉందని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఏకంగా “ఇది ప్రభాస్ రేంజ్ సినిమా కాదు” అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ వేస్తున్నారు. ఇలా ట్రైలర్ చూసిన తర్వాత పాజిటివ్, నెగిటివ్ రియాక్షన్లు రెండూ సమానంగానే కనిపిస్తున్నాయి.