టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సనే పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. వీరు ముగ్గురు కూడా ఓ సంవత్సరం బాక్సా ఫీస్ దగ్గర పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మరి ఈ ముగ్గురు ఏ సినిమాలతో ... ఎప్పుడు పోటీ పడ్డారు. చివరగా ఎవరు విన్నర్ గా నిలిచారు అనే వివరాలను తెలుసుకుందాం.
2001 వ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ ముగ్గురు నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు సినిమాలు విడుదల అయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదల ఈ రెండు సినిమాలలో మృగరాజు మూవీ కి నెగటివ్ టాక్ రాగా , నరసింహ నాయుడు మూవీ కి బ్లాక్ బస్టర్ ట్రాక్ వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలు విడుదల అయిన తర్వాత 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 వ తేదీన విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన దేవి పుత్రుడు సినిమా విడుదల అయింది. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. ఇలా భారీ అంచనాల నడుమ 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మృగరాజు , నరసింహ నాయుడు , దేవి పుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో సంక్రాంతి విన్నర్ గా బాలకృష్ణ హీరో గా నటించిన నరసింహ నాయుడు మూవీ నిలవగా ... ఆ తర్వాత దేవీ పుత్రుడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మృగరాజు సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. 2001 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా చివరగా బాలకృష్ణ హీరో గా నటించిన నరసింహ నాయుడు సినిమా నిలిచింది.