డార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్: త్వరలోనే మరో స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ..!?

Anilkumar
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రం తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో పలు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు 95 కోట్ల రూపాయలు, రెండో రోజు 58 కోట్లు, మూడో రోజు 64.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 214 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక 4వ రోజు ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కర్ణాటక, మలయాళ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 39 కోట్ల రూపాయలు, తమిళంలో 5.5 కోట్ల రూపాయలు, హిందీలో 39 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు

 చేసింది. ఇక ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే కల్కి తరువాత ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్లో మొదలు పెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమా వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక లవ్ స్టోరీ అని అంటున్నారు. సీతారామం తర్వాత హనురాఘవపూడి ఈ సినిమాపైనే పనిచేసాడు. లవ్ స్టోరీలు ఎగ్జిక్యూట్

 చేయడంలో హను ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టోరీని వార్ నేపథ్యంలో ఏ రేంజ్ కి తీసుకెళ్తాడు? అన్నది చూడాలి. ప్రస్తుతం హనురాఘవపూడి ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారుట. హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి? కీలక నటులు ఎవరు? వంటి పనుల్లో తలమునకలై ఉన్నారట. రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: