బంపర్ ఆఫర్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్.. ఏకంగా ఆ స్టార్ హీరో తో రొమాన్స్..!?

Anilkumar
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను చేసి హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. హీరోయిన్ గా కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఈ నటి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా తరువాత తనకి టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలా ఇప్పటివరకు లేడీ ఓరియంట్ సినిమాలు చేస్తూ భారీగా గుర్తింపును తెచ్చుకుంది ఈమె. అయితే అలా వరుస సినిమాలు చేసిన ఈమెకి ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

టాలీవుడ్ కంటే ఇతర భాషల్లో నటించే అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. అయితే కొన్నాళ్లపాటు టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇక స్టార్ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లుగా తాజాగా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే మీనాక్షి చౌదరి ఫిక్స్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్

 ను సెలెక్ట్ చేసినట్లు అనీల్ రావిపూడి వివరించాడు.  ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఫుల్ యాక్షన్ ఎంట్రటూనర్‌గా సాగే ఈ సినిమాల్లో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించనుందని.. ప్రియురాలుగా మీనాక్షి చౌదరి ఉండనుందని చెప్పుకొచ్చాడు. జులై 3 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందుని.. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామంటూ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: