సీమ ఎమ్మెల్యే గారి తాలూకా : కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆ విషయంలో నెగ్గగలడా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగగా అప్పటివరకు అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇక మొదటి నుండి వైసీపీ ఈ సారి అధికారం మాదే భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు మకే దక్కపోతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఏదేమైనా వీరికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ ప్రాంతంలో మాత్రం పెద్ద మొత్తంలో అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

ఎందుకు అంటే వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వ్యక్తి కావడం వల్ల ఆయనకు ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉండడంతో ఏ ప్రాంతంలో తక్కువ సీట్లు వచ్చినా కానీ రాయలసీమలో మాత్రం పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు వైసిపికి వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ రిజల్ట్ అందుకు పూర్తి భిన్నంగా వచ్చింది. రాయలసీమలో కూడా ఈ సారి వైసిపి పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అందులో భాగంగా కళ్యాణ దుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసిపి మొదటి నుండి గెలుపు మాదే అనే ధీమాను వ్యక్తం చేసింది.

కానీ ఈ ప్రాంతంలో కూడా ఈ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కళ్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన అమిలినేని సురేంద్ర బాబు గెలిచాడు. రాయలసీమ ప్రాంతంలో వైసిపి పార్టీకి గట్టిపట్టు ఉంటుంది. దానితో సురేంద్ర బాబు వైసిపి నేతల తాకిడిని తట్టుకొని నిలబడగలడా అనే అనుమానం కూడా కొంతమందిలో వ్యక్తం అవుతుంది. మరి ఈయన వైసిపి అభ్యర్థులను ఏ స్థాయిలో నిలవరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb

సంబంధిత వార్తలు: