జై బాలయ్య: వైసీపీని వణికిస్తున్న దమ్మున్న మాస్ ఎమ్మెల్యే రా?

Purushottham Vinay

•మాస్ కి కేరాఫ్ అడ్రస్ గా బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న బాలయ్య!


•బాలయ్య సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఊర మాసే!


•హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వైసీపీని వణికించిన మాస్ హీరో బాలయ్య! 


హిందూపురం - ఇండియా హెరాల్డ్: టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్య ఒక గొప్ప మాస్ హీరో.. అలాగే గొప్ప మాస్ పొలిటికల్ లీడర్ కూడా.. బాలయ్య తెలుగు సినిమా నటుడుగా, శాసనసభ సభ్యుడుగా దూసుకుపోతున్నాడు. తెలుగు చిత్ర సీమలో బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి చెందిన నటుడు. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు అయ్యాడు. బాలయ్య బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ హీరో, రియల్ లెజెండ్, నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్.టి.రామారావు కుమారుడు. ప్రస్తుతం బాలయ్య సినిమా కెరీర్ తో పాటు పొలిటికల్ కెరీర్ ని కూడా మాస్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం మూడోసారి అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


బాలయ్య పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే ఆయన 2014 శాసనసభ ఏన్నికలలో మొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే అయ్యారు. 2019 లో వైసీపీ సునామిలో కూడా రెండవ సారి శాసనసభకు ఎన్నికయిన ఘనత బాలయ్యది. ఇక ఈ 2024 ఎన్నికల్లో కూడా శాసనసభకు ఎన్నికయ్యి ఎమ్మెల్యే అయిన బాలయ్య వైసీపీని వణికించాడు. ఇలా 2014 నుంచి 2024 దాకా అపజయమే ఎరుగని మాస్ ఎమ్మెల్యేగా బాలయ్య రికార్డ్ సృష్టించాడు. బాలయ్య తీరు ఊర మాస్.. మాట్లాడే మాట ఊర మాస్.. చేసే సినిమాలు ఊర మాస్.. ఇలా మాస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలయ్య పాలిటిక్స్ లో కూడా ఊర మాస్ ఎమ్మెల్యేగా దూసుకుపోతున్నారు. హిందూ ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ ఏదైనా అధికారం ఎవరిదైనా బాలయ్య దిగనంత వరకే.. బాలయ్య దిగారంటే విజయం అయనదే.. అలా తిరుగులేని ఎమ్మెల్యేగా బాలయ్య హిందూపురంలో దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: