కల్కి 2898 AD: గుడ్ న్యూస్! తగ్గనున్న టికెట్ రేట్లు?

Purushottham Vinay
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.


ఈ సినిమాకి ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో  ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి. అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది.. 


అయితే సినిమాకు టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ప్రేక్షకులు కొంత వెనుకంజ వేస్తున్నారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 రేటు పెంచగా.. ఏపీలో  రూ.75, 125 మేర రేట్లు పెరిగాయి.ఇక తెలంగాణలో అర్లీ మార్నింగ్ షోలకైతే  రూ.200 రేటు పెంచారు. అంత రేటు పెట్టి సినిమా చూసేందుకు ప్రేక్షకులు కొంచెం వెనుకంజ వేస్తున్నారనే చర్చ ఉంది.సినిమాకు ఉన్న హైప్‌కి వీకెండ్ వరకు ప్రాబ్లెమ్ లేకపోయినా.. వీక్ డేస్‌లో ఈ రేట్లతో సినిమా నడవడం కష్టం అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు తగ్గించి మరింతగా ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: