అక్కినేని అఖిల్ పని అయిపోయినట్టేనా.. చప్పుడు చేయట్లేగా...??

Suma Kallamadi
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఏ మాయ చేసావే, మనం, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు, 100% వంటి హిట్ సినిమాలతో నాగచైతన్య సెటిల్ అయిపోయాడు. అతనికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇక ఈ హీరోకి తిరుగు లేదని చెప్పుకోవచ్చు కానీ అతని తమ్ముడు అంటే అక్కినేని నాగార్జున అమల కుమారుడు అఖిల్ మాత్రం ఇప్పటిదాకా స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు.
హస్తార వేదవిద్య సినిమా చేస్తున్నాడు దీనికి ముందు ఏజెంట్ మూవీ తీశాడు ఇది పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీనికంటే ముందు మోస్ట్ ఎలిజిబెల్ బ్యాచిలర్ సినిమా చేశాడు అది కాస్త బాగానే ఆడింది ఇక దానికి ముందు కూడా అన్ని ఆయనకు ఫ్లాప్సే వచ్చాయి. ఇప్పుడు మన చేతిలో పెద్దగా అవకాశాల్లేవు. ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. చూస్తుంటే ఈ నటుడు క్లిక్ అయ్యే ఛాన్సే లేదని తెలుస్తోంది. UV క్రియేషన్స్ ఒక ప్రాజెక్టు ఇతడితో చేస్తానని మొదట కమిట్‌ అయింది కానీ ఇప్పటిదాకా మూవీ అనౌన్స్ చేయలేదు.
 ప్రేక్షకులు మర్చిపోకుండా ఉండాలంటే ఏదో ఒక మంచి దర్శకుడిని పట్టుకొని ఒక మంచి కథతో సినిమా తీయాల్సిన అవసరం ఉంది. లేదంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక మంచి హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అఖిల్ కి ఎంతగానో ఉంది. నాగార్జున కూడా అఖిల్ కెరీర్‌ను వదిలేసినట్లు తెలుస్తోంది. వేరే నిర్మాణ సంస్థలతో మాట్లాడి అఖిల్ తో ఒక సినిమా తీయించాలనే ప్రయత్నం కూడా నాగార్జున చేయడం లేదని శని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 అఖిల్ మంచి హీరో మెటీరియల్. నాగార్జున కంటే అందగాడే. మంచి ఎత్తు, మంచి రంగు ఉన్నాడు. కానీ స్టోరీ సెలక్షన్‌ విషయంలో అతడు ఫెయిల్ అవుతున్నాడు అందువల్ల మూవీలు ఎదురు తంతున్నాయి. నాగచైతన్య చాలా తెలివైనవాడు మొదట హీరో ఇమేజ్ను ఎలివేట్ చేసే సినిమాలు తీశాడు అవి వర్కు కాకపోవడంతో మీ ఇంటి రేంజ్ లవ్ స్టోరీలు ఎంచుకుంటూ సక్సెస్ లో సాధిస్తున్నాడు ఇలా కథా బలం ఉన్న, పెద్దగా హీరోకి ఎలిమెంట్స్ లేని సినిమాలను అఖిల్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కానీ అందుకు అఖిల్ ఒప్పుకోవడం లేదు అదే ఈయన కెరీర్ కి స్పీడ్ బ్రేకర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: