ఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్ చేయనున్న నబా నటేష్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటిమానులలో నబా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటే ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ బ్యూటీకి కొంత కాలం క్రితం చిన్న యాక్సిడెంట్ జరగడంతో ఈమె కాలికి గాయం అయింది. దానితో ఈమె కొంత కాలం రెస్టు తీసుకుంది. దానితో అనేక సినిమా అవకాశాలు ఈమెకు వచ్చినా కూడా సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈమె వరుస పెట్టి సినిమాలలో నటించడానికి రెడీ అయింది.

అందులో భాగంగా ఈమె తాజాగా డార్లింగ్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ లో ప్రియదర్శి హీరోగా నటించగా , ఈమె హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను మంది దశలో ముందుకు కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ... ఈ మూవీలో ఒక అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు , దాని కోసం మేకర్స్ ఈ బ్యూటీని సంప్రదించగా ఈమె ఈ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా , సాయి పల్లవి ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిజంగానే ఈ సినిమాలో గనుక ఈమెకు అవకాశం వచ్చినట్లు అయితే ఈ బ్యూటీకి అదిరిపోయే క్రేజీ సినిమాలో ఆఫర్ వచ్చినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: