ఆ విషయంలో ఆ ఐదుగురు స్టార్ హీరోల కంటే వెనుకబడిపోయిన ప్రభాస్..?

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా నిన్నటితో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ 7 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలక్షన్లు వచ్చాయి. 7 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల విషయంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి మూవీ ఏ స్థానంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.43 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.90 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయిన ఏడవ 7 వ రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.48 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.04 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్గా నటించగా ... దీపికా పదుకొనే , అమితా బచ్చన్ కీలక పాత్రలలో నటించారు. కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: