బాహుబలి2 తరువాత కల్కితో ఆ రేర్ రికార్డ్ కొట్టిన ప్రభాస్?

Purushottham Vinay

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.అయితే ‘బాహుబలి 2’ లాంటి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వచ్చిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.. కానీ ఒక్క సినిమా కూడా టార్గెట్ రీచ్ అవ్వలేక బ్రేక్ ఈవెన్ కాలేదు.


చివరకి ‘సలార్’ సినిమాకి  బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా కానీ ‘డంకీ’ తో  పోటీ వల్ల ఆ సినిమా కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.‘కల్కి 2898 ఏడి ’ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అని బయ్యర్స్ కంగారు పడ్డారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉండటం వల్ల.. వీక్ డేస్ లో కూడా ‘కల్కి సినిమాకి మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. రెండో వీకెండ్ కూడా ‘కల్కీ సినిమాకి అడ్డులేకుండా పోయింది. పైగా బరిలో ఒక్క క్రేజీ మూవీ కూడా లేదు. అందువల్ల రెండో వారం కూడా ‘కల్కీ..’ క్యాష్ చేసుకోవడం మాత్రమే కాకుండా..అందుకే బ్రేక్ ఈవెన్ కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో  పుంజుకుంటుంది కాబట్టి 2 వ వీకెండ్ కే రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా అధిగమించే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా ‘బాహుబలి 2’ సినిమా తర్వాత కల్కి రూపంలో ప్రభాస్ కి ఓ క్లీన్ హిట్ పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: