సూసైడ్ చేసుకున్న రోబోట్.. నిజంగా ఇది సాధ్యమేనా?

praveen
నేటి ఆధునిక యుగం లో టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధార పడుతున్న మనుషులు సొంతంగా ఆలోచించడం మరిచిపోతున్నారా అంటే l కొన్ని కొన్ని ఘటనలు చూస్తే అవును అనే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ మీద అతిగా ఆధార పడుతూ చివరికి సమస్యలను ఎలా పరిష్కరించుvకోవాలో కూడా తెలియక సతమతమవుతున్నారు. దీనితో చిన్న చిన్న సమస్యలకే అక్కడితో జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది.

 స్కూల్ చదివే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగం చేసే యువకుల వరకు ఎంతో మంది చిన్నచిన్న సమస్యలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది ఫ్యామిలీలో చిన్న వివాదాలు తలెత్తితే చాలు ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అన్న విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అది సరేగాని ఇప్పుడు ఈ ఆత్మహత్యల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. అయితే ఇప్పటివరకు ఎంతోమంది మనుషులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం చూసాము. కానీ ఒక మిషన్ ఆత్మహత్య చేసుకుంది అంటే నమ్ముతారా.. మిషన్ ఆత్మహత్య చేసుకోవడమేంటి.. అలా ఎందుకు జరుగుతుంది.. జోక్ చేయడానికైనా ఒక లిమిట్ ఉంటుంది అంటారు ఎవరైనా.

 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఒక షాకింగ్ ఘటన జరిగింది. దక్షిణ కొరియాలో ఏకంగా ఒక ఆఫీసులో సేవలు అందించే రోబోట్ ఆత్మహత్య చేసుకుంది. ఏకంగా దానంతట అదే మెట్లపై నుంచి దూకింది. ఇక అంతకుముందు అయోమయంగా తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో రోబో సూసైడ్ చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇలాంటి కేసు ఇదే తొలిసారి అంటూ చెబుతున్నారు  ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు రోబో ముక్కలను  కంపెనీకి పంపినట్లు తెలిపారు. అయితే మనుషుల్లా రోబోలలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని.  రోబోలు ఆత్మహత్యలు చేసుకోవడం అసాధ్యం అంటున్నారు మరి కొంతమంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: