‘శంబాల’ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో అల్లు అరవింద్

Reddy P Rajasekhar

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రముఖ రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

 అల్లు అరవింద్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ సినిమాని యుగంధర్ ముని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం ఉంది. ‘శంబాల’ ట్రైలర్ చూసిన వెంటనే ఆదికి బన్నీ మెసెజ్ పెట్టాడు. కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది (నవ్వుతూ). నా కుటుంబంలోని వ్యక్తి సక్సెస్ అయినప్పుడు నేను రావాలని ఇక్కడకు వచ్చాను. కొంచెం ఆలస్యంగా అయినా కూడా ఆది అద్భుతంగా నటించి విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి ఆది హైవే ఎక్కినట్టుగా దూసుకుపోవాలి. బ్రహ్మాండమైన పాత్రలు ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అర్చనా ఐయ్యర్ డివైన్ పాత్రను అద్భుతంగా పోషించారు. బేబీ చైత్ర అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించింది. ఇలాంటి కథను, దర్శకుడిని నమ్మి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఆది సక్సెస్ అయితే.. ఎదిగితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను. ‘శంబాల’ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను’ అని అన్నారు.

 ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అడిగిన వెంటనే వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. సినిమా చూసి మరీ ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ జర్నీలో ఇండస్ట్రీలో నుంచి ఎంతో మంది నాకెంతో సపోర్ట్ చేశారు. మా ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ అని కూడా ప్రభాస్ గారు పోస్ట్ పెట్టారు. నాకు హిట్టు పడాలని అందరూ సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ యుగంధర్ గారు ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ప్రతీ క్రెడిట్ ఆయనకే దక్కాలి. యుగంధర్ పడిన కష్టమే ఇదంతా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్ చేసిన నిర్మాతలిద్దరికీ థాంక్స్. మళ్లీ మేమంతా కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అర్చన గారికి థాంక్స్. ‘శంబాల’లో పని చేసిన, సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క నటుడికి థాంక్స్. శ్రీ చరణ్ పాకాల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ‘శంబాల’ కోసం టెక్నికల్ టీం చాలా కష్టపడింది. ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి. కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు. మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుతున్నాను. మా మూవీని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, మీడియాకి థాంక్స్. ఇకపై కొత్త ఆదిని చూస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి సినిమాలు చేస్తాను’ అని అన్నారు.

 సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘అమ్మానాన్నల ఆశీర్వాదంతో 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఇలా ‘శంబాల’తో హిట్టు ఇవ్వడం ఆడియెన్స్ గిఫ్ట్. సినిమా ఫ్లాప్ అయినా ప్రయత్నం ఆపొద్దు అని మా అమ్మ గారు నాకు చెబుతుండేవారు. అదే మాట ఆదికి కూడా చెప్పాను. నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇలా ‘శంబాల’తో హిట్టు రావడం ఆనందంగా ఉంది. మహీధర్ రెడ్డి, రాజశేఖర్ గారు ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని నిర్మించారు. నిర్మాతలు సంతోషంగా ఉన్నంత వరకు ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. నిర్మాత పెట్టిన ఖర్చు రావాలి, దాంతో పాటుగా లాభాలు రావాలి. యుగంధర్ చాలా సైలెంట్‌గా ఉంటారు. ‘ప్రస్థానం’ నుంచి సందీప్ కిషన్‌తో అదే అనుబంధం ఉంది. కోన వెంకట్ నాకు ఫ్యామిలీ లాంటివాడు. ‘నువ్వుగా వెళ్లి సక్సెస్ అయి రా’ అని నాతో  మా నాన్న చెప్పారు. అదే మాటని ఆదికి నేను చెప్పాను. ఆది ఎక్కువగా మాట్లాడడు. ‘ప్రేమ కావాలి’ నుంచి ఇప్పటి వరకు ఆది కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ‘శంబాల’తో విజయం సాధించాడు. ‘శంబాల’ ప్రివ్యూని చూసి ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గానే స్పందించారు. ప్రతీ ఒక్కరూ ‘మన ఆది హిట్టు కొట్టారు’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన అభిమానులందరికీ థాంక్స్. ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్’ అని అన్నారు.

 డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. ‘సాయి కుమార్ గారి మంచితనం వల్లే ఇండస్ట్రీ అంతా ఇలా కదిలి వస్తోంది. కొడుకు సక్సెస్ అయితే తండ్రి ఎలా సంతోషిస్తారో నాకు తెలుసు. సక్సెస్ కొట్టిన తరువాత కూడా సాయి కుమార్ గారు రిలాక్స్ అవ్వడం లేదు. ఆదికి సక్సెస్ రావడం కాస్త లేట్ అయిందేమో కానీ.. చాలా గట్టిగా సక్సెస్ కొట్టాడు. ఆది మంచితనం వల్లే ఈ విజయం దక్కింది. ఆదికి వచ్చిన సక్సెస్ చూసి అందరూ సంతోషిస్తున్నారు. సినిమాని అద్భుతంగా తీసిన దర్శక, నిర్మాతలకు కంగ్రాట్స్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల కూడా ఓ హీరోనే. ఆయన ఆర్ఆర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.

 డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ .. ‘సాయి కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో హిట్టు కొట్టారు. ఆది ఏడాది చివర్లో హిట్ కొట్టారు. ‘శంబాల’ టీజర్, ట్రైలర్ చూసి ఇది నా జానర్ కదా? అని అనుకున్నాను. ‘శంబాల’ మూవీ చూసి నేను షాక్ అయ్యాను. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సౌండింగ్ ఇచ్చారు. సుషుమ్న నాడి ఎక్కడ పేలిపోతుందో అని భయపడ్డాను. ఇంత పెద్ద హిట్ కొట్టిన దర్శక, నిర్మాతలకు కంగ్రాట్స్’ అని అన్నారు.

 సందీప్ కిషన్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ హిట్ అవ్వడంతో అందరూ నాకు ఫోన్ చేసి ‘మీ ఫ్రెండ్ హిట్టు కొట్టాడు’ కంగ్రాట్స్ అని మెసెజ్ చేస్తున్నారు. నిజాయితీగా సినిమా తీస్తే, మంచి వ్యక్తి కష్టపడి సినిమా చేస్తే హిట్ ఇస్తారని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. ఓ మూవీ సక్సెస్ అయితే అది కేవలం టీంకే చెందదు. ఆ విజయం ఇండస్ట్రీలో ఎంతో మందిలో స్పూర్తిని నింపుతుంది. నిర్మాతలైన రాజశేఖర్ గారు, మహీధర్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడు యుగంధర్ ముని చాలా అద్భుతంగా ఈ మూవీని తీశారు. రాజేష్ దండా ఈ మూవీని ముందే చూసి హిట్ అని చెప్పేశారు. ఆదికి సాయి కుమార్ సంపాదించి పెట్టినంత మంచితనం ఇంకెవ్వరూ సంపాదించి ఇవ్వలేరు. ఆదికి హిట్టు వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ మూవీని తీస్తున్నాను. నా ప్రొడక్షన్‌లో అదే బెస్ట్ మూవీగా నిలుస్తుంది’ అని అన్నారు.

 కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ నిజంగానే డివైన్ బ్లాక్ బస్టర్. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఆదికి మంచి విజయం దక్కాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. సాయి కుమార్ గారు అందరికీ కావాల్సిన మనిషి. ఇది మా ఇంటి వ్యక్తి సాధించిన విజయంగా అనిపిస్తుంది. ఆదితో నేను చేసిన ‘పులి మేక’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు ఆది సక్సెస్ కొట్టడం ఆనందంగా ఉంది. ఓ మునిలా యుగంధర్ ముని తపస్సు చేసి ఈ మూవీని తీశాడు. ప్రతీ ఒక్క పాత్రని అద్భుతంగా రాశాడు. అందరి టాలెంట్ నిరూపించిన కంటెంట్ ఉన్న చిత్రమిది. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్‌లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇలాంటి కొత్త, కంటెంట్ ఉన్న చిత్రాలు మరిన్ని రావాలి’ అని అన్నారు.

 రాజేష్ దండా మాట్లాడుతూ .. ‘‘శంబాల’ లాంటి మంచి సినిమాను మీడియానే జనాల వరకు తీసుకెళ్లింది. చిన్న చిత్రాల్ని చూసేందుకు థియేటర్లకు రావడం లేదు అనే మాటల్ని ఎడమ కాలితో తిప్పి కొట్టింది ‘శంబాల’. ప్రివ్యూలో ఈ మూవీని చూసి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్‌లో ఏదో ఒకటి అవుతుందని చెప్పాను. కథను ఎక్కడా డీవీయేట్ కాకుండా దర్శకుడు అద్భుతంగా తీశారు. కంటెంట్‌ను నమ్మి ఆది గారు ఈ మూవీని చేశారు. ఆ కంటెంట్‌ నచ్చి జనాలు బ్లాక్ బస్టర్ స్టేటస్‌ను ఇచ్చారు. కొడుకు సక్సెస్‌ను చూసి సాయి కుమార్ గారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కె ర్యాంప్ చిత్రంతో సాయి కుమార్ గారితో నాకు మంచి బంధం ఏర్పడింది. ఓ కొడుకుగా తండ్రికి ఇంత కంటే మంచి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎంత కాంపిటీషన్‌ ఉన్నా కూడా మంచి డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చి నిలబెట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్. వారెప్పుడూ ఇలానే మంచి చిత్రాల్ని తీయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 అయ్యప్ప శర్మ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ ఆడియెన్స్ అందరికీ నచ్చింది. నిర్మాతలతోనే ఏ సినీ ప్రయాణమైనా మొదలవుతుంది. ఏదైనా మూవీ హిట్ అయితే.. ఆ టీం మాత్రమే హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆది హిట్టు కొడితే ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆది ఎప్పుడూ ఇలానే ఉండాలి.  ఆడియెన్స్‌కి, అభిమానులకి ఏం కావాలో అదే ఇవ్వాలని ఆదిని కోరుకుంటున్నాను. హిట్టు కొట్టడం కంటే నిలబెట్టుకోవడం కష్టం. నిర్మాణంలో వృథా ఖర్చులు అందరూ తగ్గించుకోవాలి. సాయి అన్న ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. ‘కేజీయఫ్’కి కూడా ‘శంబాల’ టీంలానే ప్రమోషన్స్ చేశాం. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

 రవి శంకర్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ టీంకి కంగ్రాట్స్. కొత్త దర్శకుడిని నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన మహీధర్, రాజశేఖర్ గార్లకు థాంక్స్. ఇలాంటి ఓ మూవీని మా ఆదికి ఇచ్చిన యుగంధర్ గారికి థాంక్స్. శ్రీ చరణ్ పాకాల అద్భుతంగా ఆర్ఆర్ ఇచ్చారు. ఆది చాలా సున్నితమైన వ్యక్తి. ‘శంబాల’తో ఆది హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. చదువుకునే టైంలో క్రికెట్ మీద ఇష్టాన్ని చూపించి సక్సెస్ అయ్యాడు. క్రికెట్ నుంచి సినిమాల్లోకి వస్తానని ఆది చెప్పాడు. అయితే చాలా కష్టపడి ఫైట్స్, డ్యాన్స్, యాక్షన్స్ ఇలా అన్నీ నేర్చుకుని వచ్చాడు. హిట్లు వచ్చినా రాకున్నా ప్రయత్నం మాత్రం ఆది ఎప్పుడూ ఆపలేదు. నిజాయితీతో కష్టపడుతూ వచ్చిన ఆదికి ‘శంబాల’తో విజయం దక్కింది’ అని అన్నారు.

 నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీని పరిమిత బడ్జెట్‌లోనే తీయాలని అనుకున్నాం. కానీ యుగంధర్ ముని అవుట్ పుట్ చూసి ఎంతైనా ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయ్యాం. ఆది గారి సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

 నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీ ఆడియెన్స్ అందరికీ నచ్చింది. సెకండ్ వీక్‌లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మాకు సపోర్ట్ చేసిన ఆది గారికి, యుగంధర్ గారికి థాంక్స్’ అని అన్నారు.

 దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ‘‘శంబాల’ సక్సెస్‌కి నేను ఒక్కడిని కారణం కాదు. ఇదంతా టీం వర్క్. నా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారి సపోర్ట్ వల్లే చిత్రం ఇంత బాగా వచ్చింది. ఆది గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రకు న్యాయం చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆర్టిస్టులందరికీ గాయాలు అయ్యాయి. అయినా అందరూ సపోర్ట్ చేసి నటించారు. ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ ఆర్ఆర్, శ్రవణ్ ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాకంటే శ్రీ చరణ్‌నే అందరూ ఎక్కువగా పొగుడుతున్నారు. సినిమాకి ప్రతీ ఒక్కరూ కష్టపడతారు. కానీ కొన్ని చిత్రాలే ఆడియెన్స్‌కి నచ్చుతాయి. చాలా లేయర్స్‌తో ఈ మూవీని తీశాను. ఆడియెన్స్ మా సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. భగవద్గీతతో మా చిత్రాన్ని పోల్చుతున్నారు. సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే సౌండింగ్‌ను ఫీల్ అవుతారు. ఈ మూవీని రాజేష్ దండా గారికి ముందే చూపించాం. ఈ సినిమా చూసిన వెంటనే హిట్టు అని రాజేష్ దండా గారు ఒకే మాట చెప్పారు. జీ, ఆహా వాళ్లు మా మూవీని చూసి వెంటనే కొనేసుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదరగొట్టేశాడు అని మైత్రి శశి ప్రశంసించారు. మేం కంటెంట్ ఎంత బాగా తీసినా అది జనాల వరకు రీచ్ అవ్వాలి. సాయి కుమార్ గారి వల్లే ఈ చిత్రానికి ఈ రీచ్ వచ్చింది.  ముందు నుంచీ కూడా మా సినిమాకి ఓ డివైన్ వైబ్ ఉంటూ వచ్చింది. మా మూవీ కోసం ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి సపోర్ట్ చేసింది. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

 అర్చనా ఐయ్యర్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’కి మంచి మౌత్ టాక్ వచ్చింది. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. టికెట్లన్నీ వెంటనే సేల్ అయిపోతోన్నాయి. ఇదే మాకు అసలైన విజయం. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. ‘శంబాల’ టీం నాకు ఫ్యామిలీలాంటిది. మా మూవీని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. కంటెంట్ ఉంటే సినిమాల్ని హిట్ చేస్తారని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. ఆది గెలిచారు.. మేమంతా గెలిచాం. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

 మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీని మేమే రిలీజ్ చేయాలని అడిగిన సాయి కుమార్ గారికి, మాకు అవకాశం ఇచ్చిన మహీధర్ గారికి, రాజశేఖర్ గారికి థాంక్స్. మా అభిప్రాయం ఎప్పుడూ తప్పు కాదని మరోసారి ఆడియెన్స్ నిరూపించారు. ఆది గారికి ఇది ఆరంభం. ఇక మున్ముందు మరిన్ని హిట్లు కొట్టాలని, వాటిని మేమే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు యుగంధర్ గారికి మరిన్ని అవకాశాలు రావాలి. నిర్మాతలిద్దరూ ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలని, హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ అయితే మంచి సినిమాలెప్పుడు వచ్చినా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మొదటి వారం కంటే రెండో వారంలోనే ఎక్కువ షేర్ రాబోతోంది. మున్ముందు ఇది భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది’ అని అన్నారు.

 ఉషా పిక్చర్స్ సురేష్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీని మాకు ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఆదికి బ్లాక్ బస్టర్ హిట్ రావడం ఆనందంగా ఉంది. మున్ముందు ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. రెండో వారంలో కలెక్షన్లు పెరుగుతాయి’ అని అన్నారు.

 మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీకి నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. ఇది నాకు 49వ చిత్రం. ‘శంబాల’ నాకెంతో ప్రత్యేకం. ప్రతీ చిత్రానికి ఎంతో కష్టపడతాం. కానీ ప్రతీ సారి ఫలితం మనకు అనుకూలంగా రాదు. కానీ ‘శంబాల’ మూవీకి అద్భుతమైన విజయం దక్కింది. ఆది గారికి, నిర్మాతలకు కంగ్రాట్స్. ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి. అప్పుడు వైబ్‌ను ఫీల్ అవ్వగల్గుతారు’ అని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: