రేవంత్‌రెడ్డి కొత్త ప్లాన్.. హైదరాబాద్‌ను "క్యూర్" చేస్తారా?
జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్ లో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పునర్వ్యవస్థీకరణతో పరిపాలన సమర్థవంతంగా మారి ప్రజలకు సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.నగర ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నెలకు మూడు రోజులు పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త గుంతలు కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులు నాలాలను ఆక్రమణల నుంచి కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు ప్రారంభించాలని హైడ్రా జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగాలకు బాధ్యత అప్పగించారు. దోమల నివారణ అంటువ్యాధుల నియంత్రణపై కూడా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ చర్యలతో నగరం కాలుష్య రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తమైంది. మంత్రివర్గ సభ్యులు అధికారులు ఈ ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నారు.
క్యూర్ పరిధిలో పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యమంత్రి. డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని నిర్ణయించారు. ఇది నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి నెట్ జీరో లక్ష్యానికి దోహదపడుతుంది. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని ఆయన పిలుపునిచ్చారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు