ఇసుక పాలసీ పై చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఏపీ ప్రజలకు ఇకపై ఇబ్బందులు ఉండవ్‌..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రోడ్లు అత్యంత అధ్వానంగా మారాయి. నిత్యవసర ధర పెరగడం కూడా ఏపీ ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది అయితే వీటన్నిటిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ చేపట్టారు. ఈ సమీక్షలో టీడీపీ పాలనలోని ఇసుక పాలసీకి.. వైసీపీ పాలనలోని ఇసుక పాలసీకి మధ్య ఉన్న తేడా ఏంటో చంద్రబాబుకు అధికారులు వివరించారు. వైసీపీ ఇసుక పాలసీతో ప్రభుత్వానికి చాలా నష్టమే వచ్చిందని అధికారులు తెలిపినట్లు సమాచారం. అంతేకాదు జగన్ విధానాల వల్ల ఇసుక కొరత ఏర్పడిందట. ధరల భారంతో నిర్మాణాలు చేపట్టడం పెద్ద భారమైపోయిందని అధికారులు చంద్రబాబుకు వివరించారు.
గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పజెప్పారని, దానివల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయని వాళ్లు చంద్రబాబుకు వెల్లడించారు. అధికారులు చెప్పిన ముఖ్యమైన వివరాలన్నీ విన్నాక చంద్రబాబు చాలా కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలని కూడా తెలియజేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. రోడ్ల మరమ్మత్తు పనులను ముమ్మరం చేయాలని కూడా సూచించారు.
 ఏ విషయంలో అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాలకు సత్వర పరిష్కారాలను అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్లాన్స్ అనేవి లాండ్ టర్న్ వర్క్ అయ్యేలాగా ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఉపశమనం కలిగించాలని చంద్రబాబు అధికారులకు మరీ మరీ చెప్పినట్లు ఆదేశాల ప్రకారం తెలుస్తోంది.  ఉచిత ఇసుక విధానం కూడా అందుబాటులో వదిలేస్తామని ఇటీవల చంద్రబాబు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు, ధరలను తగ్గిస్తామని కూడా మాటిచ్చారు. ఆ హామీలకనుగుణంగానే కొత్త ఇసుక పాలసీపై అధికారులకు బాబు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: