SSMB 29: సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Purushottham Vinay
SSMB 29: సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే జర్మనీ వెళ్లి కొంత శిక్షణ తీసుకొని వచ్చాడు.దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. భారతదేశంలోని భాషల్లోనే కాకుండా అంతర్జాతీయంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. దీనికి తగ్గట్లుగానే నటీనటులను ఆయన ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అందుకు తగ్గట్లుగానే వారు అంతకాలం సినిమా చేసినందుకు, ఓర్పు వహించినందుకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను హీరో ఖాతాలో రాజమౌళి ఈజీగా వేస్తాడు. దీంతో ఆయన ఎన్ని సంవత్సరాలు సినిమా చేయమని అడిగినా అది ఎలాగో మినిమం ఇండస్ట్రీ హిట్ అవుతుంది కాబట్టి హీరోలు కాదనకుండా ఓకే చెప్పేస్తుంటారు. 


అంతేగాక ఆ హీరో మార్కెట్ కూడా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణే ఇందుకు ప్రధాన ఉదాహరణ. ప్రస్తుతం వీరు టాప్ 3 పాన్ ఇండియా హీరోస్ గా దూసుకుపోతున్నారు.ప్రస్తుతం తెలుగులోనే సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా హీరో స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్యలో పారితోషికం పుచ్చుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు అంతకు డబుల్ తీసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత తీసుకుంటున్నారనే విషయం బయటకు రానప్పటికీ ఈ సినిమాకు మహేష్ బాబుకు ఖచ్చితంగా రూ.200 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ప్రొడ్యూసర్ నారాయణ రెడీగా ఉన్నడని తెలుస్తుంది. తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ హీరోను ఎవరూ అందుకోలేరంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: