ట్రైలర్‌తోనే బాక్సాఫీస్ వైబ్స్ తమన్ మాస్ రిప్లై హాట్ టాపిక్...!
ట్రైలర్ 2.0 లో తమన్ అందించిన మ్యూజిక్ కు ఫిదా అయిన ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా.. “ట్రైలర్ కే ర్యాంప్ అయ్యా మారుతి. ఆ మ్యూజిక్ ఏంట్రా మెంటల్ నా కొ*కా” అంటూ అత్యుత్సాహంతో, కాస్త అసభ్య పదజాలంతో కూడిన ప్రశంసను కురిపించాడు.దీనికి తమన్ తనదైన శైలిలో స్పందిస్తూ.. “థ్యాంక్స్ రా పిచ్చ నా పకోడా” అని రిప్లై ఇచ్చారు.తమన్ ఇచ్చిన ఈ సరదా మరియు మాస్ రిప్లై చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. సాధారణంగా తనపై వచ్చే ట్రోల్స్‌ను లైట్ తీసుకునే తమన్, ఈసారి అభిమాని భాషలోనే రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో మ్యూజిక్ విషయంలో తమన్‌ను ట్రోల్ చేసిన కొందరు అభిమానులు ఇప్పుడు ఈ ట్రైలర్ BGM చూసి.. "అన్నా మమ్మల్ని క్షమించు, ఇప్పటి వరకు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం" అని పోస్ట్లు పెడుతున్నారు. దీనికి కూడా తమన్ సానుకూలంగా "అన్నది తమ్ముళ్లేగా.. పర్లేదులే" అని రిప్లై ఇచ్చి మనసు గెలుచుకున్నారు.
ఈ కొత్త ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి: ప్రభాస్ కామెడీ టైమింగ్, డ్యాన్స్ మూమెంట్స్ పాత 'డార్లింగ్'ను గుర్తు చేస్తున్నాయి. మారుతి తన మార్క్ కామెడీని, భారీ విజువల్స్ తో కూడిన హారర్ ఎలిమెంట్స్ ను పక్కాగా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది.ట్రైలర్ చివర్లో ప్రభాస్ వేసిన 'జోకర్' మేకప్ మరియు ఆ నవ్వు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.తమన్ అందించిన BGM ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. గతంలో ఎదురైన ట్రోల్స్‌కు తన మ్యూజిక్‌తోనే సమాధానం చెప్పాలని తమన్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ 'రెబల్' ట్రీట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.