గుండెకు మేలు చేసే ఈ పండుతో ఎన్నో రోగాలు మాయం?

Purushottham Vinay
గుండెకు మేలు చేసే ఈ పండుతో ఎన్నో రోగాలు మాయం ?

మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం ఖచ్చితంగా చాలా ముఖ్యం. ఎందుకంటే ఫైబర్ బ్లడ్ లిపిడ్లు, రక్తపోటు ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవన్నీ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని ఈజీగా తగ్గిస్తాయి. పైగా ఈ స్టార్ ఫ్రూట్‌లో కేలరీలు చాలా తక్కువ. ఇది బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.విటమిన్ సి కలిగిన స్టార్ ఫ్రూట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన పండు. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులు, అనేక రకాల క్యాన్సర్‌లతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నుండి రక్షించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్టార్ ఫ్రూట్ విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే పండు. దీన్ని గుండె, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, పనితీరుకు మేలు చేస్తుంది. ఒక పెద్ద స్టార్ ఫ్రూట్‌లో 3.5 గ్రాముల ఫైబర్ అనేది ఉంటుంది.


జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇది ముఖ్యం. ఎందుకంటే అధిక ఫైబర్ ఆహారం తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ స్టార్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ప్రోయాంతోసైనిడిన్స్, బి-కెరోటిన్, గల్లిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో వివిధ రకాల మొక్కల సమ్మేళనాలు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరం సహజ యాంటీఆక్సిడెంట్ రక్షణను మెరుగుపరుస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.స్టార్ ఫ్రూట్ ఒక ఉష్ణమండల పండు. ఇవి దక్షిణ అమెరికా, దక్షిణ ఫ్లోరిడా వంటి ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతాయి. ఇండియాలో కూడా మనం ఆన్లైన్ ద్వారా ఈ పండుని ఆర్డర్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: