బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్ ఇద్దరి ప్రేమ గురించి తెలియని వారు ఉండరు.ఒకానొక దశలో ఈ జంట పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కానీ సడన్గా వీరిద్దరూ విడిపోయారు.ఇక బ్రేకప్ తర్వాత అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకుంటే శిల్పా శెట్టి రాజ్ కుంద్రాని పెళ్లాడింది.అయితే శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ల బ్రేకప్ కి అసలు కారణం అదే అంటూ అక్షయ్ తో కలిసి వర్క్ చేసిన సినీ నిర్మాత సునీల్ దర్శన్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సునీల్ దర్శన్ బాలీవుడ్ తికానా చాట్ లో మాట్లాడుతూ.. బాలీవుడ్లో వీరిది ఒక మంచి పెయిర్.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఈ జంట విడిపోయారు.
గతంలో ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ల పెళ్లి జరుగుతుందని ట్వింకిల్ తండ్రి రాజేష్ ఖన్నా కి జ్యోతిష్యుడు చెప్పారట. కానీ ఆ సమయంలో అక్షయకి ట్వింకిల్ కి మధ్య ఎలాంటి బాండింగ్ లేదు. ఆ సమయంలో ఆ మాటని నేను అంత సీరియస్గా తీసుకోలేదు.కానీ ఫైనల్ గా ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఇక శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ల బ్రేకప్ కి కారణం శిల్పా శెట్టి తల్లిదండ్రులే. శిల్పాశెట్టిని పెళ్లి చేసుకోవాలంటే అక్షయ్ కుమార్ కి శిల్పా తల్లిదండ్రులు కొన్ని కండిషన్స్ పెట్టారంట.ఒకవేళ ఆ కండిషన్స్ పెట్టకపోతే వీరిద్దరి జీవితం మరోలా ఉండేది.
అయితే శిల్పా తల్లిదండ్రులు తమ కూతురు ఆర్థిక భద్రత కోసం అక్షయ్ కి కండిషన్స్ పెట్టారు. పేరెంట్స్ అందరు అలాగే అనుకుంటారు.కానీ వీరి విషయంలో శిల్పా తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని నాకు అనిపించింది.ఇక శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ల బ్రేకప్ జరిగినప్పుడు అక్షయ్ కుమార్ హార్ట్ బ్రేక్ అయింది అనుకున్నాను.కానీ ఆ సమయంలో అక్షయ్ కుమార్ వరుస సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ బాధ నుండి బయటపడ్డారు అంటూ నిర్మాత సునీల్ దర్శన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ల పెళ్లికి శిల్ప తల్లిదండ్రులే విలన్స్ అయ్యారు.