డార్లింగ్
ప్రభాస్ నటించిన
కల్కి 2898 AD
సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ
సినిమా యునానిమస్
బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య
టాలీవుడ్ సీనియర్
నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని
నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్
హీరో కమల్ హాసన్,
బాలీవుడ్ బిగ్ బాస్
అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి
ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి. అలా ఇప్పుడు
సినిమా బుకింగ్స్ విషయంలో
ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ
సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.గడిచిన 24 గంటల్లో
కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ పైగా
టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.
నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు
కల్కి 2898 ఏడీ
మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ
సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది.. ఈ
సినిమా తెలుగు, తమిళం, మలయాళం,
కన్నడ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఇక ఈ
మూవీ హిందీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. జూలై నెలాఖర్లోనే కల్కిని ఓటీటీ స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‍లో మార్పులు చేసినట్టు సమాచారం తెలుస్తోంది.దీంతో ఓటీటీ రిలీజ్‍ను మేకర్స్ ఆలస్యం చేసేందుకు డిసైడ్ అయ్యారు.సెప్టెంబర్ రెండో వారంలో ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం తెలుస్తోంది.