బాహుబలి 2 బాటలో కల్కి 2?

Purushottham Vinay

కల్కి 2898 AD సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నిర్మాత అశ్వినిదత్ కూడా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశామని చెప్పడంతో ఫ్యాన్స్ జోష్ రెట్టింపు అయ్యింది.పార్ట్ 2 లో చాలా ట్విస్టులున్నాయి. కీలక భాగం ఇంకా షూట్ చేయలేదు. ముఖ్యంగా కమల్ హాసన్ పోషించిన యాస్కిన్  ఎపిసోడ్లు చిత్రీకరణ చేయాల్సి ఉంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. కల్కి మొదటి భాగానికి ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది.


అయితే కల్కి 2 పూర్తి చేయడానికి ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత ఇంకో సంవత్సరం విఎఫెక్స్ పనులు ఉంటాయి. మధ్యలో ప్రభాస్ తన ఇతర కమిట్ మెంట్లను ఫినిష్ చేసుకోవాలి. వీటి మధ్యలో కల్కి 2 కోసం డార్లింగ్ డేట్లు సర్దాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఈజీ కాదు.సో దీన్ని బట్టి ఎలా చూసుకున్నా కూడా బాహుబలి 2 లాగా కల్కి 2కి కూడా ఎంత లేదన్నా ఇంకో రెండేళ్లు పైగానే సమయం పడుతుంది కాబట్టి 2026 లో విడుదల ఉంటుంది.ప్రస్తుతం కల్కి సినిమాకి ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో  ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి. అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: