కలెక్షన్స్ కోసం.. సోషల్ మీడియా హస్తం..!
అలా నిన్న విడుదలైన చిత్రాలలోని ఒక సినిమాకి సంబంధించి రెండు రాష్ట్రాలలో మేజర్ టౌన్స్ లో ఇలాంటి ట్రిక్ ప్లే చేసినట్లుగా వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున విడుదలైన చిత్రాలలోని ఒక చిత్రానికి నిర్మాతనే భయంకరంగా టికెట్లు కొనుగోలు చేశారు. హైదరాబాద్ సిటీలోని మల్టీప్లెక్స్ లలో అయితే మరింత ఎక్కువగా ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మల్టీప్లెక్స్ లలో, 50% ఎలాగో నిర్మాతలకే వస్తుంది. కనుక ఇలాంటి ట్రిక్ ఇక్కడ ప్లే చేస్తున్నారు. సినిమా థియేటర్లోపల చూస్తే ఖాళీ ఉన్న, బయట బుకింగ్ చూస్తే మాత్రం ఫుల్. ఇలాంటివి సోషల్ మీడియాలో ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి. దీంతో జనంలో కూడా సినిమా గురించి ఒక పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.
దీన్ని చూసిన మరొక సినిమా యూనిట్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ షోలకు ఇలాంటి పనే చేసింది. చేసిన చిత్రాలు చిన్న చిత్రాలే అయిన వీటికి ఇలా ఖర్చు చేస్తే నిర్మాతలకు నష్టమే వాటిల్లుతుంది. కానీ హిట్ సినిమా తీశామని చెప్పుకోవడానికి ఈ ఖర్చు భరించాల్సి ఉంటుంది. సినిమా బాగుంటే ఇలాంటి ట్రిక్ ల వల్ల ఫలితం ఉంటుంది. కానీ సినిమా యావరేజ్ టాక్ ఉంటే ఈ ట్రిక్ పని చేస్తుందా అంటే సోమవారం రోజున టెస్ట్ రిజల్ట్ చూశాక అసలు విషయం అర్థమవుతుంది.