"Champion First Day Collections": ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన రోషన్..ఏం కలెక్షన్స్ రా బాబు ఇవి!
అంతేకాదు, విడుదలకు ముందే విడుదలైన ‘గిర్రా గిర్రా…’ పాట సూపర్ హిట్ కావడంతో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. యూత్‌లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే నమ్మకం బలపడింది.ఇక నిన్న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ‘ఛాంపియన్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పాలి. సినిమా చూసిన చాలామంది “బాగుంది” అంటూ పాజిటివ్‌గా స్పందించారు. ముఖ్యంగా రోషన్ మేక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోగా రోషన్‌కు ఇది ఒక మంచి మైలురాయిగా చెప్పుకోవచ్చు.
కథ విషయానికి వస్తే, సినిమా కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. కొత్తదనం ఉండటంతో పాటు భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమతుల్యంగా చూపించే ప్రయత్నం కనిపించింది. అయితే సినిమా కొన్ని కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా సాగిందనే అభిప్రాయం కూడా వినిపించింది. ఆ కారణంగా కొన్ని సన్నివేశాల్లో డ్రాగ్ అనిపించినా, మొత్తంగా చూస్తే సినిమా యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకుంది.టాక్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా పర్లేదు అనిపించింది. సుమారు 30 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు, మొదటి రోజే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2.75 కోట్ల నెట్ కలెక్షన్ రావడం గమనార్హం. ఇది రోషన్ లాంటి యంగ్ హీరో స్థాయికి చూస్తే మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి.
మొత్తంగా చూస్తే, భారీ స్టార్ సపోర్ట్, మంచి ప్రమోషన్స్, యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు కలిసి ‘ఛాంపియన్’ సినిమాకు మంచి ఆరంభాన్ని అందించాయి. రాబోయే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్ బలపడితే, కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.