టాక్ అలా..కలెక్షన్స్ ఇలా..శంబాల ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టింది అంటే..?
యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయి మిస్టికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు మరియు మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కథ, కథనంతో పాటు విజువల్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.ఈ సినిమాలో ఆది సాయికుమార్‌కు జంటగా అర్చన అయ్యర్ నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, ఈ చిత్రంలో స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సహాయ నటీనటుల పాత్రలు కథకు మరింత బలం చేకూర్చాయి.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “శంబాల” సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకు దాదాపుగా ఎలాంటి ప్రమోషన్లు జరగకపోయినా, ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ టాక్ వల్ల థియేటర్లకు జనాలు భారీగా వచ్చారు. సినిమా కథనం, మిస్టికల్ ఎలిమెంట్స్, ట్విస్టులు ప్రేక్షకులను సీట్ అంచులపై కూర్చోబెట్టాయి.మొదటి రోజే ఈ సినిమా మంచి ఓపెనింగ్‌ను నమోదు చేసింది. దాదాపుగా కొట్టిన్నర కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇటీవల కాలంలో ఆది సాయికుమార్ కెరీర్‌లో వచ్చిన సినిమాలతో పోలిస్తే, ఇది ఆయనకు కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. నటన పరంగా కూడా ఆది ఈ సినిమాలో కొత్త కోణాన్ని చూపించాడు అని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే, ఈ విజయయాత్ర అంత సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే, అదే సమయంలో దురంధర్, అవతార్ 3, ఈషా, దండోరా, ఛాంపియన్, వృషభ వంటి సినిమాల నుంచి “శంబాల”కు గట్టి పోటీ ఎదురవుతోంది. పెద్ద బడ్జెట్ సినిమాలు, స్టార్ క్యాస్ట్ ఉన్న చిత్రాలు థియేటర్లను ఆక్రమించుకున్నప్పటికీ, “శంబాల” మాత్రం తన కంటెంట్ బలంతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.ఈ నేపథ్యంలో, ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా ఎంతవరకు వసూళ్లు రాబడుతుందన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వర్డ్ ఆఫ్ మౌత్ ఇలానే కొనసాగితే, రాబోయే రోజుల్లో “శంబాల” మరింత బలమైన కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, తక్కువ హైప్‌తో విడుదలై, కేవలం కథా బలంతో ప్రేక్షకులను మెప్పించి విజయబాట పట్టిన సినిమాగా “శంబాల” ఈ క్రిస్మస్ సీజన్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని చెప్పవచ్చు.