చిత్తూరు ఎంపీ సీటు కూడా ఆ పార్టీ ఖాతాలోకే.. సైకిల్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తుది ఫలితాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాల్లో విజయం సాధించింది. చివరి వరకూ దర్శి నియోజకవర్గం విషయంలో ఉత్కంఠ కొనసాగగా ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎట్టకేలకు విజయం సాధించింది. లోక్ సభ నియోజకవర్గాల విషయానికి వస్తే 21 స్థానాల్లో కూటమి సత్తా చాటుతుండగా వైసీపీ 4 స్థానాలకు పరిమితం కానుంది.
 
అయితే చిత్తూరు ఎంపీ స్థానం కూడా కూటమి ఖాతాలోకే చేరడం విశేషం. కూటమి అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీ చేయగా వైసీపీ అభ్యర్థిగా ఎన్. రెడ్డప్ప పోటీ చేయడం జరిగింది. తొలి రౌండ్ నుంచి ప్రసాదరావు ఆధిక్యత చూపించగా 1,80,000 మెజారిటీతో ఆయన విజయం సాధించడం విశేషం. చిత్తూరు ఎంపీగా కూటమి అభ్యర్థి సత్తా చాటడంతో పార్టీ శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
 
జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ చేతుల మీదుగా ఆయన డిక్లరేషన్ ఫారం అందుకోవడం విశేషం. తనను ఎంపీగా గెలిపిస్తే చిత్తూరు లోక్ సభ స్థానాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన ప్రసాదరావు రాబోయే రోజుల్లో ఆ మాటను నిలబెట్టుకుంటారేమో చూడాలి. బీజేపీ మద్దతు ఉండటంతో ఏపీకి భారీ మొత్తంలో నిధులు వస్తాయని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
వైసీపీని టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో విమర్శలు చేయడం ద్వారా ప్రసాదరావు వార్తల్లో నిలిచారు. మరోసారి చిత్తూరులో వైసీపీని గెలిపిస్తే చిప్పే మిగులుతుందని కామెంట్లు చేసిన ఆయన పక్కా ప్రణాళికతో ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా విజయం సాధించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పెద్దిరెడ్ది హవాకు చెక్ పెట్టాలని భావించిన ఆయన రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తారేమో చూడాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇకపై కూటమి హవా కొనసాగనుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: