అనంతపురం: కాంగ్రెస్ కంచుకోట ను బద్దలు కొట్టిన టిడిపి.. వైసిపి గల్లంతు.!

Divya
రాయలసీమ ప్రాంతంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి , సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా టిడిపి ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. ఇక లోక్సభ స్థానం విషయానికి వస్తే 17వ లోక్సభ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ తరఫున 2019లో తలారి రంగయ్య ఎంపిగా అధికారంలోకి వచ్చారు. వాస్తవానికి అనంతపురం కాంగ్రెస్ కి అడ్డా అని చెప్పవచ్చు ఇప్పటివరకు 12 సార్లు కాంగ్రెస్ ఎంపీ సీటు ని కైవసం చేసుకోగా.. మూడుసార్లు టిడిపి , ఒకసారి సిపిఐ, ఒకసారి వైఎస్ఆర్సిపి పార్టీలు అనంతపురం ఎంపీ సీటును దక్కించుకున్నాయి.
ఇక తాజాగా వెలువడిన 2024 ఎంపీ ఫలితాల విషయానికి వస్తే.. వైసీపీ తరఫున మాల గుండ్ల శంకర్ నారాయణ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా..  టిడిపి తరఫున వాల్మీకి అంబిక ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. అలాగే కాంగ్రెస్ తరపున వజ్జల మల్లికార్జున ఎంపీ స్థానానికి పోటీ చేశారు .. ఇక తాజాగా వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే అంబికా వాల్మీకి 755,862 ఓట్లతో విజయం సాధించింది. వైయస్ఆర్సీపీకి ఐదు లక్షల 573,769 ఓట్లు రాగా.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన  మల్లికార్జునకు 41,954 ఓట్లు లభించాయి. ఇక మొత్తానికైతే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేసిన వాల్మీకి అంబిక 182,093 ఓట్ల తేడాతో ఆధిక్యత సాధించింది.
ఇక అటు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇటు లోక్సభ స్థానంలో కూడా టిడిపి హవా కొనసాగించింది.. మొత్తానికైతే ఇక్కడ టిడిపి దెబ్బకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అనంతపురం కూడా టిడిపి వశం అయ్యింది.. ఇక వైసిపి గల్లంతయింది  అనడంలో సందేహం లేదు. మొత్తానికి అయితే అటు అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 163 సీట్లు రాగా వైసిపి కేవలం 12 సీట్లతో సరిపెట్టుకుంది .ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: