ఇండియన్ సినిమా పరిశ్రమలో అమీర్ ఖాన్ మిస్టర్ ఫర్పెక్ట్ అనే పేరుంది. ఆయన ఎంచుకొనే చిత్రాలు, నటించే పాత్రలు అందరికి స్పూర్తిగా నిలుస్తాయి. ఇదిలావుండగా ఆస్కార్ ఎంట్రీలకు సంబంధించి ప్రతి ఏడాది కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్క్రీనింగ్ పెట్టి ఆయా భాషాలకు చెందిన సినిమాలను ఎంపిక చేస్తుంది. ఈసారి తమిళ్ నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజ, జమా, జిగర్తాండ డబల్ ఎక్స్ ఆస్కార్ బరిలో నిలిచాయి. మలయాళం నుంచి ఊళ్ళోజుక్కు, ఆడు జీవితం, ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్, ఆట్టం ఉన్నాయి. మరాఠీ నుంచి స్వరగంధర్వ సుధీర్ ఫడకే, ఘాట్, ఘరత్ గణపతి నిలిచాయి. హిందీ నుంచి కిల్, ఆర్టికల్ 370, షామ్ బహదూర్, గుడ్ లక్, జోరం, ఆనిమల్, శ్రీకాంత్, వీర్ సవార్కర్, చోటా భృమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యం, లాపట్టా లేడిస్, చందు చాంఫియన్లు ఆస్కార్ కోసం పోటీపడ్డాయి.ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ కొట్టడంతో తెలుగు సినిమా నుంచి ఏయే సినిమాలకు ఆస్కార్ ఎంట్రీకి వెళ్లనున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాగ్ అశ్విన్ - ప్రభాస్‌ల కల్కి 2898 ఏడీ, ప్రశాంత్ వర్మ హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు బరిలో నిలిచాయి. అయితే అన్ని సినిమాలను వెనక్కి నెట్టి హిందీ సినిమా లాపతా లేడీస్ ఇండియా నుంచి అకాడమీ అవార్డుల కోసం అధికారిక ఎంట్రీ సాధించింది.
97వ అకాడమీ అవార్డుల కోసం భారత్ నుంచి ఏ సినిమాను పంపించాలన్న దానిపై చెన్నైలో సోమవారం ది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశమై లాపతా లేడీస్‌ను బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా పంపాలని తీర్మానించారు. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మించారు.ఇదిలావుండగా ఈ సారి ఎలాగైన అవార్డు సాధించాలన్న కసితో ఉన్న ఆమిర్, ప్రమోషన్ విషయంలో జక్కన్న ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు.2025లో జరిగే ఆస్కార్ వేడుకలో ఇండియా తరువాత లాపతా లేడీస్ బరిలో దిగుతోంది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడుతోంది. ఈ సారి ఎలాగైన అవార్డు సాధించాలన్న కసితో ఉన్న ఆమిర్, ప్రమోషన్ విషయంలో జక్కన్న ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు.అదెలాగంటే ఆస్కార్స్ టైమ్‌లో ట్రిపులార్ టీమ్ హాలీవుడ్ మీడియాకు రెగ్యులర్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చింది. వీలైనంత ఎక్కువగా ఆస్కార్ జ్యూరీ దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఆమిర్ కూడా అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నారు.ఆల్రెడీ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం స్టార్ట్ చేసింది ఆమిర్ టీమ్. ఈ నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో ను ప్రమోట్ చేసిన ఎలాగైన ఆస్కార్ సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఆమిర్. మరి ఆమిర్ అయినా ఇండియన్ కు ఆస్కార్ సాధించి పెడతారేమో చూడాలి.