ఇది నిజంగా సంచలనమే.. ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల పిల్లాడు.. ఎవరంటే?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా 2025 ఐపీఎల్ సీజన్ గురించి చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కంటే ముందు.. ఇక ఈ ఏడాది మెగా వేలం జరగబోతుంది. ఈ మెగా వేలంలో ఎలాంటి రికార్డులు బద్దలు కాబోతున్నాయి అన్న విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కూడా ఈసారి వేలంలో పాల్గొంటూ ఉండడంతో ఆయా ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎలా పోటీ పడతాయి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

 ఈ క్రమంలోనే ఏకంగా 1000 కి పైగా ఆటగాళ్లు అటు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే ఇలా ఐపీఎల్ వేలం కోసం దరఖాస్తు చేసుకున్న ఆటగాళ్లలో అతిపిన్న వయస్కుడు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ మెగా వేలం కోసం దరఖాస్తు చేసుకున్నాడు అన్న వార్త కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అదేంటి 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ లోకి అడుగు పెట్టబోతున్నాడా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

 ఇలా ఐపీఎల్ కు దరఖాస్తు చేసుకున్న ఆటగాళ్లు అందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేశారు. ఇలా 2025 మెగా వేలం షార్ట్ లిస్టులో భారత్కు చెందిన 13 ఏళ్ల కుర్రాడు కూడా చోటు దక్కించుకోవడం  గమనార్హం. ఏకంగా వైభవ్ సూర్యవంశి అనే 13 ఏళ్ల చిన్నోడు.. ఇలా ఐపిఎల్ మెగా వేలం కోసం చోటు దక్కించుకున్నాడు. ఏకంగా రూ. 30 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలో పాల్గొనబోతున్నాడు. కాగా వైభవ్ బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు  2011 మార్చి 27న జన్మించాడు. వైభవ్ సూర్యవంశి భారత అండర్ 19 జట్టులో కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు లిస్టులో అత్యధిక వయస్కుడిగా  ఇంగ్లాండ్ మాజీ ఫేసర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. ఈ దిగ్గజం వయసు ప్రస్తుతం 42 ఏళ్లు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: